జగన్ పై దాడి : ఆ విషయాలు చెబితే నా తమ్ముడిని చంపేస్తారేమో ..?   Accused Srinivas Sister Ratnakumari Comments On Jagan Attack     2018-11-05   16:50:24  IST  Sai M

‘జగన్ పై నా తమ్ముడితో ఎవరో కావాలనే దాడి చేయించారు. ఎవరు చేయించారో చెబితే.. వాళ్లు నా తమ్ముడిని చంపేస్తామని బెదిరించి ఉంటారు. అందుకే వాడు చెప్పడం లేదేమో. డబ్బులు ఇస్తామని ఆశపెట్టి ఈ పని చేయించి ఉంటారు. ఆ డబ్బుతో భూమి కొందామని అనుకొని ఉంటాడు. అందుకే వాళ్లు చెప్పినట్లు చేశాడేమో’… ‘నా తమ్ముడి ఇంతటి దారుణానికి ఒడిగడతాడని మేము ఊహించలేదు.

ఈ పనికి పురమాయించిన వారు ఇప్పుడు వాడిని చంపేస్తారేమోననే భయం మా అందర్నీ వెంటాడుతోంది. ఎవరో చేయించిన పనికి నా తమ్ముడు ఇలా బలైపోయాడు. నేను కళ్లారా చూసే దానిని. వాడు చిన్న ఫోన్‌ వాడే వాడు. మరి తొమ్మిది ఫోన్‌లు మార్చాడంటే నమ్మలేకపోతున్నాను. అంటూ … వైసీపీ అధినేత జగన్ పై దాడి చేసిన నిందితుడు శ్రీనివాస్ సోదరి రత్నకుమారి ఆవేదన వ్యక్తం చేస్తోంది.