బాబోయ్.. కారు డ్రైవర్ ఇంట్లో 8 ట్రంకు పెట్టెలు.. అందులో అంత బంగారం, వెండి!

అతను ఓ ట్రెజరీ ఉద్యోగి.అతని ఆదాయం నెలకు మహా అయితే లక్ష లేదా అంతకు తక్కువే ఉంటుంది.

 Police Finds A Gold Treasure In A House In Bukkarayasamudram   Police, Gold Trea-TeluguStop.com

కానీ అతని దగ్గర ఏకంగా పెట్టెలు పెట్టెలు బంగారం బయటపడింది.ఇది వినడానికి కాస్త ఆశ్చర్యం కలిగించినప్పటికి నిజంగానే ఓ ట్రెజరీ ఉద్యోగి కారు డ్రైవర్ బంధువు ఇంట్లో భారీ ఎత్తున అవినీతి ఖాజానా బయటపడింది.

సినిమాను తలిపించే విధంగా అతను కిలోలుకొద్దీ బంగారాన్ని, వెండిని, కొన్ని కోట్లరూపాయల నగదును అతని కారు డ్రైవర్ బంధువు ఇంట్లో పెట్టారు.అది అంతా నిన్న పోలీసులు స్వాధీనం చేసుకోవడంతో సంచలనంగా మారింది.

అనంతపురం జిల్లా ట్రెజరీ ఆఫీస్ లో పని చేసే ఓ సీనియర్ అకౌంటెంట్ కు చెందిన అవినీతి సంపాదన అని తెలిసి అందరూ షాక్ కి గురయ్యారు అంటే నమ్మండి.

ట్రెజరీలో సీనియర్ అకౌంటెంట్‌గా పని చేసే మనోజ్‌కుమార్‌ బుక్కరాయసముద్రం ఎస్సీ కాలనీకి చెందిన నాగలింగను కారు డ్రైవర్‌గా పెట్టుకున్నాడు.

అయితే సీసీఎస్‌ పోలీసులకు మనోజ్‌కుమార్, నాగలింగపై ఫిర్యాదు వెళ్లడంతో గత కొద్దీ రోజుల నుంచి వారి కదలికలు గమనించి డ్రైవర్ ని అరెస్ట్ చేశారు.అనంతరం అతను ఇచ్చిన సమాచారం మేరకు అతడి మామ బాలప్ప ఇంటిని పోలీసులు తనిఖీ చెయ్యగా అక్కడ ఏకంగా 8 ట్రంకు పెట్టెలు దొరికాయి.

అందులోని రెండు ట్రంకు పెట్టెలోది లెక్కించే సరికి అర్ధరాత్రి గడిచింది.దీంతో మనోజ్ కుమార్ ను అరెస్ట్ చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube