అకౌంట్ హోల్డర్స్ బీ అలర్ట్.. కీలక ప్రకటన చేసిన ఎస్‌బీ‌ఐ

దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంకు తన అకౌంట్ హోల్డర్స్ కోసం కీలక ప్రకటన చేసింది.ఆగస్టు 6, 7 తేదీల్లో కొన్ని గంటల పాటు డిజిటల్ ట్రాంజాక్షన్స్ పని చేయబోవని ఓ ప్రకటనలో తెలిపింది.

 Account Holders Be Alert Sbi Made A Key Announcement, Sbi, Yono, Sbi Customers A-TeluguStop.com

మెరుగైన బ్యాంకింగ్ సేవలు కస్టమర్లకు అందించే నిమిత్తమై మెయింటెనెన్స్ వర్క్స్ జరుగుతున్నాయని, అందుకే ట్రాంజాక్షన్స్ జరగవని పేర్కొంది.వినియోగదారులందరూ కూడా తమకు సహకరించాలని కోరింది.

ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేసింది ఎస్‌బీ‌ఐ సంస్థ.ఎస్‌బీఐ డిజిటల్ బ్యాంకింగ్ ఫ్లాట్‌ఫార్మ్స్ యోనో బిజినెస్, యోనో, యోనో లైట్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు ఆగస్టు 6వ తేదీ రాత్రి 10.45 గంటల నుంచి ఆగస్టు 7వ తేదీ తెల్లవారుజాము 1.15 గంటల వరకు పని చేయబోవని తెలిపింది.

ఈ విషయాలను కస్టమర్లు గుర్తించుకోవాలని, ఆ టైమ్‌లో డిటిజల్ ట్రాంజాక్షన్స్ చేయొద్దని సూచించింది.ఇంపార్టెంట్ నోటిస్ పేరిట ట్విట్టర్ వేదికగా ఎస్‌బీఐ చేసిన పోస్ట్‌కుగాను అకౌంట్ హోల్డర్స్‌తో పాటు నెటిజన్లు స్పందిస్తున్నారు.

ఈ క్రమంలో ఎస్‌బీఐ అఫీషియల్‌ను ట్యాగ్ చేస్తూ బ్యాంక్ బ్రాంబ్‌లో రిసాల్వ్ కాని ఇష్యూస్ గురించి ట్వీట్ చేస్తున్నారు.కాగా, వాటికి ఎస్‌బీఐ అఫీషియల్‌ నుంచి రెస్పాన్స్ వస్తుండటం విశేషం.

పలు కారణాల వల్లే తప్పులు జరుగుతున్నట్లు ఎస్‌బీఐ అఫీషియల్‌ పేర్కొంటుండగా, బ్యాంక్ సర్వీసుల పట్ల నెటిజనాలు అంసతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

బ్యాంకు బ్రాంచుల్లో ఎదురైన చేదు అనుభవాల గురంచి వివరిస్తున్నారు.ఇదిలా ఉండగా ఎస్‌బీఐ ఈ ఏడాది తొలి త్రైమాసికంలో మార్కెట్ ఎక్స్‌పెక్టేషన్స్‌కు మించిన రిజల్ట్స్ ఇచ్చింది.జూన్ మంత్‌తో ముగిసిన త్రైమాసికంలో ఎస్‌బీఐ నికర లాభంగా బాగా పెరిగింది.

బ్యాంకు లాభాలు కూడా పెరిగినట్లు పేర్కొంది.నిర్వహణ లాభంతో పాటు వడ్డీ ఆదాయం, వడ్డీయేతర ఆదాయంలోనూ వృద్ధి కనబరిచినట్లు ఎస్‌బీఐ తెలిపింది.

ఈ విషయాలన్నిటినీ సమీక్షించుకున్నాకే వెల్లడించింది ఎస్‌బీఐ.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube