సర్వే : మరణం విషయంలో మగాళ్లకంటే ఆడవారే తోపులు

ఒకప్పుడు మనిషి ఆయుషు 100 ఏళ్లు అనుకునే వారు.కాని కాల క్రమేనా ఆ ఆయుషు తగ్గిపోతూ వచ్చింది.

 According To World Health Survey Woman Live Longer Than Men-TeluguStop.com

ప్రపంచ వ్యాప్తంగా మనుషుల సగటు ఆయువు 60 ఏళ్లుగా ఖరారు అయ్యింది.అయితే పెరిగిన టెక్నాలజీ మరియు వచ్చిన వైధ్యం వల్ల మనిషి ఆయువు అనేది ప్రపంచ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే దాదాపు 12 ఏళ్లు పెరిగింది.

అంటే ప్రస్తుతం మనిషి యావరేజ్‌ ఆయుషు 72 సంవత్సరాలు.ముందు ముందు ఈ ఆయుషు మరింత పెరిగే అవకాశం ఉందని కూడా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

మరో వైపు చావును జయించేందుకు కూడా శాస్త్రవేత్తలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.

Telugu Live Longer, Latest, Long Live-

  ఇక చావు అనేది ఆడమగకు సేమ్‌ అనుకుంటాం.కాని చావు అనేది ఆడవారి కంటే మగవారికి తొందరగా వస్తుందని చెబుతున్నారు.ఒక సర్వే ప్రకారం ఆడవారు చావు విషయంలో తోపులు అని వెళ్లడయ్యింది.

ప్రపంచ వ్యాప్తంగా పరిశీలించినట్లయితే మగాళ్లకంటే ఆడవారు దాదాపుగా 5 సంవత్సరాలు ఎక్కువగా బతికేస్తున్నారట.తోడు లేకున్నా ఎక్కువ శాతం ఆడవారు బతుకుతున్నారు.

కాని తోడు లేకుండా మగవారు ఎక్కువ కాలం బతకలేక పోతున్నట్లుగా సర్వే రిపోర్ట్‌లో వెళ్లడయ్యింది.

Telugu Live Longer, Latest, Long Live-

  ఆ సర్వే ప్రకారం మగవారు యావరేజ్‌గా 69 ఏళ్లు బతుకుతుంటే ఆడవారు మాత్రం 74 ఏళ్లు బతికేస్తున్నారు.ఈ విషయాన్ని అంతర్జాతీయ హెల్త్‌ సర్వే చేసిన సంస్థ ప్రకటించింది.మగవారి మానసిక ఒత్తిడి, పని ఒత్తిడితో పాటు యాక్సిడెంట్స్‌లో ఎక్కువగా మరణిస్తున్నారని, అందుకే మగవారి ఆయుషు ఆడవారి ఆయుషు కంటే తక్కువగా ఉంటుందట.

ప్రతి పనిలో కూడా మగాళ్లు ముందు ఉంటారు.ప్రతి విషయంలో కూడా మగాళ్లదే మొదటి నిర్ణయం అవ్వడంతో పాటు, ఎక్కువ శాతం మగాళ్లు ఆడవారు చేయలేని పనులు చాలా చేస్తారు.

Telugu Live Longer, Latest, Long Live-

  అలాంటి సమయంలో కొన్ని సార్లు చనిపోయే అవకాశం కూడా ఉందని అందుకే మగవారి లైఫ్‌ స్పామ్‌ తక్కువగా ఉందని అంటున్నారు.ఇక ఇండియాలో సరాసరిగా తీసుకుంటే ఆడవారు 70 ఏళ్లు బతుకుతుంటే మగవారు మాత్రం 67.5 ఏళ్లు జీవిస్తున్నారు.ప్రపంచ సగటుతో పోల్చితే మన ఇండియా సగటు జీవనం తక్కువ ఉండటంతో పాటు ఆడవారు మగవారి మద్య ఆయుషు కూడా తక్కువగానే ఉంది.

అంటే ఇండియాలో మగవారితో సమానంగా ఆడవారు కూడా పని ఒత్తిడిని ఎదుర్కోవడంతో పాటు పలు విషయాల్లో మగవారికి సమానంగా ఉంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube