వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో డబ్బును ఈ దిశలో అసలు దాచుకోకూడదు?

సాధారణంగా చాలా మంది వాస్తు శాస్త్రాన్ని ఎంతో గట్టిగా నమ్ముతారు.ఈ క్రమంలోనే కొన్ని వాస్తు చిట్కాలను పాటించడం వల్ల ఎన్నో రకాల సమస్యలు తొలగిపోయి ఇంట్లో అనుకూల వాతావరణ పరిస్థితులు ఏర్పడతాయని భావిస్తారు.

 According To Vastu Shastra In The House Should Not Be Hidden In This Direction Vasth Tips, Money, House, Direction, Worship, Hindu Belives-TeluguStop.com

అందుకోసమే ఇంట్లో ప్రతి ఒక్క విషయంలోనూ వాస్తును ఎంతగానో నమ్ముతారు.ఈ క్రమంలోనే చాలామంది ఎంతో కష్టపడి డబ్బులు సంపాదిస్తున్నప్పటికి చేతిలో రూపాయి కూడా నిలువకుండా ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు.

ఇలా ఇబ్బందులు పడుతున్నారు అంటే తప్పనిసరిగా వారి ఇంట్లో డబ్బును సరైన దిశలో భద్రత లేదని వాస్తు శాస్త్రం చెబుతోంది.

 According To Vastu Shastra In The House Should Not Be Hidden In This Direction Vasth Tips, Money, House, Direction, Worship, Hindu Belives-వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో డబ్బును ఈ దిశలో అసలు దాచుకోకూడదు-Devotional-Telugu Tollywood Photo Image-TeluguStop.com

వాస్తు శాస్త్రం ప్రకారం డబ్బులు ఏ దిశలో ఉంచడం వల్ల శుభం కలుగుతుందనే విషయానికి వస్తే… మనం సంపాదించే ప్రతి ఒక్క రూపాయి కూడా మన ఇంట్లో ఎల్లప్పుడు నైరుతి దిశలో భద్రపరచాలి.

ఇలా నైరుతిదిశలో భద్రపరచడం వల్ల డబ్బుకు ఏ మాత్రం కొదవుండదు.అలా కాదని డబ్బులు మన ఇంట్లో పడమర వైపు ఉంచడం వల్ల మన ఇంట్లో డబ్బు నిల్వ ఉండదు అనవసరమైన వృథా ఖర్చులకు డబ్బు వృధా అవుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

Telugu Hindu, Vasth Tips, Worship-Latest News - Telugu

డబ్బులు, కార్డ్ లు వంటి వాటిని ఎల్లప్పుడు ఉత్తర దిశలో పెట్టాలి.ఉత్తర దిశలో పెట్టడం వల్ల ధనాభివృద్ధి కలుగుతుంది.ఉత్తరం కుబేరుడి స్థానం కనుక డబ్బుని ఎల్లప్పుడు ఉత్తర దిశలో ఉంచాలి.అలాగే ఉత్తరం తూర్పు మూలలో డబ్బులు ఉంచడం కూడా మంచిదని వాస్తు శాస్త్రం చెబుతోంది .అలాగే ఉత్తర దిశలో ఒక మట్టి కుండలో నీటిని ఉంచడం లేదా  కుబేరుడి విగ్రహాన్ని ఉంచి పూజ చేయటం వల్ల మన ఇంట్లో ఆర్థిక సమస్యలు తొలగిపోయి, ఆర్థిక అభివృద్ధి కలుగుతుందని చెప్పవచ్చు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube