గరుడపురాణం ప్రకారం ఈ పద్ధతుల ద్వారా మోక్షం లభిస్తుంది.. అవి ఏమిటంటే?

మనం ఎంతో పవిత్రంగా భావించే పద్దెనిమిది పురాణాలలో గరుడ పురాణం ఒకటి.గరుడ పురాణాన్ని మహాపురాణం అని కూడా పిలుస్తారు.

 According To The Garuda Purana Nirvana Is Attained Through These Methods That Is What They Are-TeluguStop.com

ఈ గరుడ పురాణానికి ఆది దేవుడు శ్రీమహావిష్ణువు.ఈ పురాణం మనం బ్రతికి ఉన్నప్పుడు ఎలాంటి తప్పులు చేస్తే మరణం తర్వాత మనకు ఎలాంటి శిక్షలు విధిస్తారు.

నీతి, నైతికత, జ్ఞానం, త్యాగం, తపస్సు మొదలైన వాటి ప్రాముఖ్యత గురించి వివరిస్తుంది.గరుడ పురాణం మనిషి మరణం ముందు మరణం తర్వాత ఏం జరుగుతుంది అనే విషయాలను ఎంతో అద్భుతంగా తెలియజేస్తుంది.

 According To The Garuda Purana Nirvana Is Attained Through These Methods That Is What They Are-గరుడపురాణం ప్రకారం ఈ పద్ధతుల ద్వారా మోక్షం లభిస్తుంది.. అవి ఏమిటంటే-Devotional-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ క్రమంలోనే మనిషి బ్రతికి ఉన్నప్పుడు ఏవిధంగా మోక్షం పొందాలనే విషయాలను ఈ గరుడ పురాణంలో ఎంతో అద్భుతంగా తెలియజేశారు.మరి మోక్షం కలిగించే ఆ పద్ధతులు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…

మన పురాణాల ప్రకారం అన్ని లోకాలకు సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి రక్షకుడిగా ఉంటాడు.

అన్ని లోకాలలో ఏర్పడే బాధలను తొలగించే శక్తి విష్ణుమూర్తికి ఉందని భావిస్తాము.అందుకే ప్రతిరోజు ఉదయం లేవగానే ఆ శ్రీహరి నామ స్మరణ చేస్తూ రోజున ప్రారంభించడం ఎంతో ముఖ్యమని గరుడ పురాణం మనకు తెలియజేస్తుంది.

అదేవిధంగా గరుడ పురాణంలో తులసి మొక్కకు ఎంతో ప్రాధాన్యత కల్పించారు.తులసి మొక్కను సాక్షాత్తు దైవ స్వరూపంగా భావించాలని,తులసికి ప్రతి రోజు పూజ చేయడం వల్ల మోక్షం కలుగుతుందని గరుడపురాణం తెలుపుతోంది.

మనిషి మరణించే ముందు తులసి నీటిని నోట్లో పోయడం వల్ల అతని మరణాంతరం తనకు మోక్షం కలుగుతుందని ఈ పురాణం తెలియజేస్తుంది.

Telugu Burden, Ekadashi, Fasting, Ganga River, Garuda Purana, Nirvana, Penance, Sacrifice, Telugu Bhakthi, Tulasi Leaves, Vishumoorthy Pooja-Latest News - Telugu

ఒక వ్యక్తి తాను చేసిన పాపాల నుంచి మోక్షం పొందాలంటే ఏకాదశి ఉపవాస దీక్షలు చేయాలని గరుడ పురాణం చెబుతోంది.ఈ ఏకాదశి రోజు ఉపవాసం చేసి విష్ణు మూర్తికి పూజ చేయటం వల్ల మనం చేసిన పాపాలు హరించుకుపోయి మనకు విముక్తి కలుగుతుంది.ఈ ఏకాదశి రోజు ఉపవాసంతో విష్ణువుకు పూజ చేసి విష్ణు సహస్రనామాలను పట్టించడం ద్వారా కలుగుతుంది.

ఇక చివరిగా గరుడ పురాణంలో గంగానదిని మోక్షదాయనిగా అభివర్ణించారు.కలియుగంలో ఈ నీటికీ ఎంతో ప్రాధాన్యత ఉండటం చేత ముఖ్యమైన శుభకార్యాలను ఈ నీటి ద్వారా ప్రారంభించడం వల్ల మోక్షం కలుగుతుందని గరుడ పురాణం చెబుతోంది.

#Tulasi #Ganga River #Penance #Ekadashi #Garuda Purana

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

LATEST NEWS - TELUGU