ఏపీలో హైకోర్టు ఏర్పాటు ! ఎప్పుడంటే...?   Accommodation For High Court To Be Ready By December At Amaravathi     2018-10-29   17:51:09  IST  Sai M

ఆంధ్రప్రదేశ్‌లో హైకోర్టు భవనాలు నిర్మాణం పూర్తయ్యేవరకు హైకోర్టును ఎందుకు విభజించకూడదంటూ కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై ఏపీలో హైకోర్టు ఏర్పాటుపై సుప్రీంకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. భవనాల నిర్మాణంపై రెండ్రోజుల క్రితమే ఏపీ ప్రభుత్వం అఫిడవిట్‌ కూడా కోర్టుకు సమర్పించింది.నూతన భవనాల నిర్మాణంతో పాటూ హైకోర్టు విభజనపై ఏపీ ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానానికి కీలక సమాచారం అందించింది.

డిసెంబర్‌ 15లోగా అమరావతిలో హైకోర్టు తాత్కాలిక భవన నిర్మాణం పూర్తి చేస్తామని.. న్యాయాధికారుల విభజనపై ఇప్పటికే నోటిఫికేషన్‌ విడుదలైందని ఏపీ ప్రభుత్వం తరపును సీనియర్ అడ్వొకేట్ నారీమన్‌ కోర్టుకు తెలిపారు. దీనిపై స్పందించిన కేంద్ర ప్రభుత్వ న్యాయవాది వేణుగోపాల్‌.. ఏపీ సర్కార్ అంత స్పష్టంగా చెబుతున్నందున భవన నిర్మాణాలకు సంబంధించి ఫోటోలను న్యాయస్థానానికి అందజేయాలని కోరారు. అలాగే అమరావతిలో తాత్కాలిక హైకోర్టు భవనాల నిర్మాణం పూర్తయ్యాక హైకోర్టు విభజనకు నోటిఫికేషన్‌ విడుదల చేయాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.