రైతుల ప్రాణం తీసిన క్రేన్.. బావిలో పూడిక తీస్తుండగా ప్రమాదం.. !

సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం లో గురువారం విషాద ఘటన చోటు చేసుకుంది.మండలం లోని బల్లూ నాయక్‌ తండాలో ఓ రైతుకు చెందిన వ్యవసాయ బావిలో క్రేన్‌ సహాయంతో పూడిక తీస్తుండగా, ప్రమాదవశాత్తు క్రేన్ బకెట్ బావిలో కి ఒరిగి పోయిందట.

 Accident While Digging A Well Two Farmers Killed After Falling From A Crane Bucket-TeluguStop.com

దీంతో పాటు క్రేన్ కూడా బావిలోకి ఒరిగి పడిపోయిందట.

ఈ క్రమంలో బావి లోతులో ఉన్న రైతుల మీద ఈ బకెట్ పడటంతో బీమా, క్రాంతి అనే ఇద్దరు రైతులు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారట.

 Accident While Digging A Well Two Farmers Killed After Falling From A Crane Bucket-రైతుల ప్రాణం తీసిన క్రేన్.. బావిలో పూడిక తీస్తుండగా ప్రమాదం.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మరో ఇద్దరికి గాయాలయ్యాయి.కాగా వారిలో ఇస్లవత్ వెంకన్న అనే రైతు పరిస్థితి విషమంగా ఉండడంతో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారని సమాచారం.

ఇకపోతే మరణించిన మృత దేహాలను హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.కాగా ఈ ప్రమాద ఘటన గురించి తెలుసుకున్న గ్రామస్దులు ఆసుపత్రి వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారట.

ఇక హుస్నాబాద్ ప్రభుత్వ ఆస్పతి వద్ద మృతుల కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.మృతులు గిరిజనులు కావడంతో తండా లో విషాద ఛాయలు అలముకున్నాయి.

#Crane Bucket #Two Farmers #Accident #Died

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు