ప్రమాదానికి గురైన మంత్రి గారి కాన్వాయ్  

Accident To Minister Puvvada Ajay Convoy - Telugu , Cm Kcr Birthday, Kcr And Puvvada Ajay Kumar, Pragathgi Bhavan, Puvvada Ajay, Telangana State Minister Puvvada Ajay Kumar

తెలంగాణా రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారి కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు తెలుస్తుంది.సీఎం కేసీఆర్ పుట్టిన రోజు కావడం తో పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ బిజీ గా ఉన్నారు.

Accident To Minister Puvvada Ajay Convoy - Telugu , Cm Kcr Birthday, Kcr And Puvvada Ajay Kumar, Pragathgi Bhavan, Puvvada Ajay, Telangana State Minister Puvvada Ajay Kumar-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఈ క్రమంలోనే ఆయన కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు సమాచారం.పంజాగుట్ట జీవీకే మాల్‌ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తుంది.

మాల్ వద్ద వేగంగా వెళుతున్న కాన్వాయ్ కి బైక్ అడ్డు రావడం తో బైక్ ని తప్పించబోయి కాన్వాయ్ లోని మరో వాహనాన్ని ఢీకొనడం తో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది.ఈ ఘటనలో బుల్లెట్ ప్రూఫ్ వాహనంతో పాటు మరో మూడు వాహనాలు దెబ్బతిన్నాయి.

ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు.ప్రగతిభవన్‌కు మంత్రి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని అంటున్నారు.

ఘటన జరిగిన వెంటనే అనంతరం మంత్రి వేరే వాహనంలో ప్రగతి భవన్ కు వెళ్లిపోయినట్లు సమాచారం.రోడ్డు ప్రమాద కారణంగా అక్కడ కాసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది.ఘటనపై బంజారహిల్స్ పోలీసులు కేసే నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

తాజా వార్తలు

Accident To Minister Puvvada Ajay Convoy-cm Kcr Birthday,kcr And Puvvada Ajay Kumar,pragathgi Bhavan,puvvada Ajay,telangana State Minister Puvvada Ajay Kumar Related....