Sivabalakrishna : హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసులో ఏసీబీ ప్రైమరీ రిపోర్ట్

హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ( Former director Sivabalakrishna )కేసులో ఏసీబీ అధికారుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.ఈ మేరకు కేసు దర్యాప్తుపై ప్రభుత్వానికి ఏసీబీ ప్రైమరీ రిపోర్ట్( ACB primary report ) అందజేసింది.

 Acb Primary Report In Former Hmda Director Sivabalakrishna Case-TeluguStop.com

శివబాలకృష్ణ కస్టడీలో చెప్పిన వివరాలతో పాటు ఐఏఎస్ పాత్రపై రిపోర్ట్ చేసింది.ఈ క్రమంలోనే ఐఏఎస్ ను విచారించేందుకు ప్రభుత్వ అనుమతి కోరింది ఏసీబీ.

ఈ నేపథ్యంలో సర్కార్ నుంచి అనుమతి వస్తే ఏసీబీ ( ACB )సదరు ఐఏఎస్ ఆఫీసర్ ను విచారించే అవకాశం ఉంది.అలాగే శివబాలకృష్ణ ఎనిమిదేళ్లలో పది ఫోన్లు, 9 ల్యాప్ టాప్ లు వాడినట్లు అధికారులు గుర్తించారు.

శివబాలకృష్ణ అక్రమంగా సంపాదించిన ఆస్తుల వివరాలను ల్యాప్ టాప్, హార్డ్ డిస్కులో ఏసీబీ గుర్తించింది.కాగా శివబాలకృష్ణ భారీ లావాదేవీలు జరిపిన ప్రతిసారి ఫోన్ మార్చినట్లు గుర్తించారు.

ఏసీబీ సోదాల సమయంలో శివబాలకృష్ణతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించిన 31 ఎలక్ట్రానిక్ డివైస్, ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు.ఫోరెన్సిక్ నిపుణుల సహాయంతో వాటిలోని డేటాను సేకరించే పనిలో పడిందని సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube