ఓటుకి నోటు కేసులో ఇంత జరిగిందా ? రేవంత్ పాత్ర ఇంతుందా ?  

ACB Officials Reveals Shocking truths about Vote for note case, Vote for note case, TDP, Revanth Redy, Elections, ACB, Revanth Reddy Arrest, Congress Working President - Telugu Acb, Acb Officials Reveals Shocking Truths About Vote For Note Case, Congress Working President, Elections, Revanth Reddy Arrest, Revanth Redy, Tdp, Vote For Note Case

ఓటుకు నోటు కేసు ! ఈ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సంచలనం సృష్టించింది.ఆంధ్ర – తెలంగాణ విభజన తర్వాత ఏపీలో టిడిపి అధికారంలోకి రాగా, తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.

TeluguStop.com - Acb Officials Revanth Reddy Vote For Note Case

హైదరాబాద్ లో పదేళ్ల పాటు రాజధానిగా ఏపీకి అవకాశం ఉన్నా, చంద్రబాబు అకస్మాత్తుగా హైదరాబాద్ నుంచి ఏపీకి రాజధానిని మార్చడానికి గల కారణం ఓటుకు నోటు కేసు.ఈ వ్యవహారంలో చంద్రబాబు, ప్రస్తుత కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తదితరులు ఉండడం, ఈ వ్యవహారం రాజకీయంగానూ సంచలనం గానే మారింది.

ఇప్పటికీ ఓటుకు నోటు కేసు వీరిని వెంటాడుతోంది.

TeluguStop.com - ఓటుకి నోటు కేసులో ఇంత జరిగిందా రేవంత్ పాత్ర ఇంతుందా -Political-Telugu Tollywood Photo Image

అసలు ఓటుకు నోటు కేసులో జరిగిన తతంగం అంతా, ఇప్పుడు ఏసీబీ కోర్టుకు తెలిపింది.

వారు చెప్పిన ప్రకారం 2015 లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి తరఫున అభ్యర్థిగా నరేంద్ర రెడ్డిని గెలిపించేందుకు చంద్రబాబు అనేక వ్యూహాలు పన్నాడు.దీనిలో భాగంగానే రేవంత్ రెడ్డి స్టీఫెన్ సన్ అనే ఆంగ్లో ఇండియన్ కు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుకూలంగా ఓటు వేసేందుకు యాభై లక్షలు లంచం ఇస్తూ, వీడియో ఆధారాలతో సహా దొరికి పోవడంతో, రాజకీయం అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించింది.

దీనికి సంబంధించిన ఎన్నో సంగతులను ఇప్పుడు ఏసీబీ బయటపెట్టింది.అసలు ఓటుకు నోటు కేసుకి సంబంధించిన వ్యవహారం ఏవిధంగా సాగిందో కోర్టుకు వివరించింది.

తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా స్టీఫెన్సన్ తో ఓటు వేయించడానికి 2015 మే 27వ తేదీన తెలుగుదేశం పార్టీ మహానాడు లో రేవంత్ రెడ్డి, బిషప్ సెబాస్టియన్, రుద్ర ఉదయ్ సింహ, మత్తయ్య జెరూసలేం లు కుట్రపన్నారని కోర్టుకు ఏసీబి వివరాలు అందించింది.స్టీఫెన్సన్ ఓటు వేసేందుకు 50 లక్షలు అడ్వాన్స్ గా చెల్లించేందుకు రేవంత్ తదితరులు సిద్ధమైనట్లు ఏసీబీ పేర్కొంది.2015 మే 31 వ తేదీన రేవంత్ రెడ్డి శంషాబాద్ నోవాటెల్ హోటల్ నుంచి స్టీఫెన్సన్ ను కలవడానికి పుష్పనిలయానికి బయలుదేరినట్టు, నల్గొండ క్రాస్ రోడ్డు వద్దకు రావాలని తన అనుచరుడుడు ఉదయసింహ కు ఫోన్ చేసినట్లుగానూ, మెట్టుగూడా క్రాస్ రోడ్ లో ఉన్న వేం నరేందర్ రెడ్డి కుమారుడు వేం కృష్ణ కీర్తన్ నుంచి 50 లక్షలు తీసుకొని రావాలి అంటూ రేవంత్ చెప్పినట్లుగా ఏసీబీ పేర్కొంది.ఆ సొమ్ము తీసుకుని పుష్ప నిలయానికి ఉదయ్ సింహ వెళ్లడం, అక్కడ నగదు తో ఉన్న రేవంత్ రెడ్డి, సెబాస్టియన్, ఉదయ సింహాలను ఏసీబీ అరెస్ట్ చేయడం వంటి పరిణామాలు జరిగినట్టుగా ఏసీబీ కోర్టుకు తెలిపిన వివరాల్లో పొందుపరిచారట.

#CongressWorking #Revanth Redy #ACBOfficials #RevanthReddy #Elections

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Acb Officials Revanth Reddy Vote For Note Case Related Telugu News,Photos/Pics,Images..