అక్రమాస్తుల కేసులో విచారణ ఎదుర్కోనున్న చంద్రబాబు

ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో స్టే గడువు ముగియడం తో ఈ కేసు దర్యాప్తు కొనసాగించేందుకు ACB కోర్టు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది.14 ఏళ్ల కిందట లక్ష్మి పార్వతి వేసిన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో స్టే గడువు ముగియడం తో ఇప్పుడు తాజాగా విచారణ కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది.చంద్రబాబు ఏపీ సీఎంగా ఉంటూ… ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని… దీనిపై ACB దర్యాప్తు చెయ్యాలని లక్ష్మీపార్వతి 2005లో కంప్లైంట్ ఇచ్చారు.అయితే ఈ కేసు తాజా విచారణ చేపట్టిన కోర్టు ఈ కేసు విచారణ ను ఈ నెల 25కి వాయిదా వేసినట్లు తెలుస్తుంది.

 Acb Court Start Proceedings In Chandrababu Disproportion Assets Case-TeluguStop.com

సివిల్, క్రిమినల్‌ కేసుల్లో స్టే 6 నెలలకు మించకూడదని గతేడాది సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.ఆ ప్రకారం చూస్తే చంద్రబాబు కేసులో స్టే గడువు ముగిసినా దాన్ని పొడిగించాల్సిందిగా చంద్రబాబు కోరలేదు.

నెక్ట్స్ ఉత్తర్వులు వచ్చే వరకూ 2005లో హైకోర్టు ఇచ్చిన స్టే కొనసాగుతుందని చంద్రబాబు తరపు లాయర్ వాదించారు.ఈ వాదనను తప్పుపడుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గుర్తుచేశారు లక్ష్మీపార్వతి తరపు లాయర్ సురేందర్‌రెడ్డి.

Telugu Acbstart, Chandrababu, Laxmiparvathi, Tdp Chandrababu-

ఈ పరిస్థితుల్లో 2005 మార్చి 14న ఏసీబీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్ని ప్రస్తుత జడ్జి పరిశీలించారు.స్టే గడువు ముగిసినందున చంద్రబాబు తరపు లాయర్ ఇప్పుడు వాదనలు వినిపించేందుకు వీలు లేదని అప్పట్లో ఇచ్చిన ఉత్తర్వుల్ని లెక్క లోకి తీసుకున్నారు.అందువల్ల ఇప్పుడు కేసు విచారణ కొనసాగనుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube