నాన్‌బెయిలబుల్ వెన‌క బాబున్నాడ‌ట‌... వైకాపా అనుమానం

వైకాపా త‌ర‌పున రాజ్యసభ ఎన్నికల బరిలోకి దిగిన ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, విజయసాయిరెడ్డికి సీబీఐ కోర్టు నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది.వైకాపా అధ్యక్షుడు జగన్ అక్రమాస్తు కేసుల‌పై శుక్ర‌వారం జ‌రిపిన విచార‌ణ‌ల‌కు అనారోగ్యం కారణంగా విచారణకు హాజరుకాలేక పోతున్నట్లు విజయసాయిరెడ్డి పిటిషన్‌ దాఖలు చేయగా న్యాయస్థానం తిరస్కరించింది.

 Acb Court Issues Nbw To Vijay Sai Reddy-TeluguStop.com

ఉద్దేశ‌పూర్వకంగానే విజయసాయిరెడ్డి విచారణకు హాజరుకానట్లుంద‌ని సీబీఐ కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఆత‌నిపై నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేస్తున్న‌ట్లు పేర్కొంటూ కేసు విచారణ ఈనెల 10కి వాయిదా వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

కాగా సీబీఐ కోర్టు ప్రతి శుక్రవారం ఈ కేసును విచారిస్తోందని.

ఈ క్రమంలో నిందితులంతా ప్రతి విచారణకు నిందితులంతా హాజరు కావాల్సిందే నని ఆదేశాలు జారీ అయిన‌ప్ప‌టికీ… ప్రతిపక్ష నేతగా తాను రాష్ట్రంలోని వివిధ ప్ర‌జా స‌మస్య‌ల‌పై ప్రతివారం విచారణకు హాజ‌రు కాలేనంటూ జ‌గ‌న్ చేసిన విన‌తిని మ‌న్నించి కొంత మిన‌హాయింపు ఇచ్చిన విష‌యం విదిత‌మే…

అయితే జగన్‌పై నమోదైన అన్ని కేసుల విచారణను సీబీఐ కోర్టు వేగ‌వంతం చేయ‌టం వెనుక తెలుగుదేశం పార్టీ అధినేత ఒత్తిడి ఉంద‌ని వైకాపా శ్రేణులు మండిపడుతున్నాయి.గ‌త కొంత కాలంగా ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై రాష్ట్రంలో వివిధ ప్రాంతాల‌లో ప‌ర్య‌టిస్తున్న జ‌గ‌న్‌కి ల‌భిస్తున్న ్ర‌ప‌జా ద‌ర‌ణను చూసి చంద్ర‌బాబు స‌హించ‌లేక పోతున్నార‌ని, జగన్ కేసులను తెరపైకి తెచ్చే ప్రయత్నాలు చేస్తూ ప్రతిపక్షం పార్టీలను నోరునొక్కేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు విమ‌ర్శ‌ల‌కు దిగుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube