వేసవి కాలం వచ్చేసింది.. వాటి ధరలు పెంచేసిందోచ్.. !

రాష్ట్రాల్లో అప్పుడే ఎండలు భగభగమంటున్నాయి.దీనికి తోడుగా మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి.

 Ac Prices To Rise Voltas, Lg, Panasonic, Bluestar, Higher, Samsung, Ac, Prices,-TeluguStop.com

ఇక గత సంవత్సరం అంతా ఇంటిలో గడిపిన ఉద్యోగులకు ఈ సంవత్సరం కూడా ఆ బాధలు తీరేలా లేవు.

ఇలా చాలా మందికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండటంతో, ఇంత కాలం ఫ్యాన్స్‌తో సర్ధుకున్నారు.

కానీ పూర్తి వేసవి రాకముందే ఎండలు మండిపోతున్నాయి.ఇకపోతే కాస్త ఏసీ కొని ఇంట్లో పెట్టుకుందామ అనుకున్న వారికి షాకింగ్ న్యూస్.

ఎయిర్ కండీషనర్ ధరలను పెంచడానికి పలు కంపెనీలు రెడీ అవుతున్నాయట.

ఇకపోతే దేశవ్యాప్తంగా ఏసీ ధరలను 5-8 శాతం వరకూ పెంచేందుకు కంపెనీలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి.

ఈ క్రమంలో వోల్టాస్, ఎల్‌జీ, పానసోనిక్, బ్లూస్టార్, హైయర్, శాంసంగ్ కంపెనీలు ఇప్పటికే క్యాష్‌బ్యాక్, ఈఎంఐ ఆఫర్లను ప్రకటిస్తూ విక్రయాలను పెంచే ప్రయత్నాల్లో ఉన్నాయి.కాగా ఏసీ తయారీలో వాడే కంప్రెసర్, మెటల్ ధరలు పెరగడం వల్ల ఉత్పత్తి వ్యవయం పెరిగిందని, అందు వల్ల ఏసీ ధరలను 6-8 శాతం వరకు పెంచనున్నట్టు పానాసోనిక్ తెలిపింది.

Telugu Blue, Panasonic, Samsung, Voltas-Latest News - Telugu

వీటితో పాటుగా ఫ్రిడ్జ్‌ల ధరలు కూడా 3-4 శాతం వరకు పెరిగే అవకాశాలున్నాయని పానాసోనిక్ సీఈఓ మనీశ్ శర్మ తెలియచేస్తున్నారు.ఇదిలా ఉండగా టాటా గ్రూప్ అనుబంధ సంస్థ అయిన వోల్టాస్ ఇప్పటికే ధరలు పెంచిన సంగతి తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube