వైరల్‌ : యువరాజు షేక్‌ హ్యాండ్‌ ఏడ్చేసిన చిన్నారి, విషయం తెలిసి యువరాజు ఏం చేశాడో తెలుసా?

పెద్ద మనుషులకు చిన్న మనసు ఉంటుందని చాలా మంది అభిప్రాయం.కాని అబుదాబి యువ రాజు తన మంచితనంను ప్రదర్శించి అందరి ప్రశంసలు దక్కించుకున్నాడు.

 Abu Dhabi Prince Payssurprise Visit To Girl-TeluguStop.com

అబుదబి దేశంకు చెందిన యువరాజు షేక్‌ మహ్మద్‌ బిన్‌ జాయేద్‌ ఇటీవల ఒక కార్యక్రమంకు హాజరు అయ్యాడు.ఆ సందర్బంగా చిన్న పిల్లలకు యువ రాజా వారు షేక్‌ హ్యాండ్‌ ఇస్తూ ముందుకు వెళ్లాడు.

ఆ సమయంలో ఒక చిన్నారి యువరాజు షేక్‌ హ్యాండ్‌ కోసం ఎంతో తాపత్రయ పడింది.యువ రాజు గారితో చేయి కలిపేందుకు ఆ పాప చేసిన ప్రయత్నం విఫలం అయ్యింది.

 Abu Dhabi Prince Payssurprise Visit To Girl-వైరల్‌ : యువరాజు షేక్‌ హ్యాండ్‌ ఏడ్చేసిన చిన్నారి, విషయం తెలిసి యువరాజు ఏం చేశాడో తెలుసా-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కాకతాళీయంగా యువరాజు బిన్‌ జాయేద్‌ ఆ బాలికకు షేక్‌ హ్యాండ్‌ ఇవ్వకుండా ముందుకు వెళ్లి పోయాడు.దాంతో ఆ బాలిక తీవ్ర నిరుత్సాహంకు గురైంది.ఆమె యువరాజు వెళ్లి పోయిన తర్వాత కన్నీరు పెట్టుకుందట.తన తోటి స్నేహితులకు షేక్‌ హ్యాండ్‌ ఇచ్చిన యువ రాజు గారు తనకు మాత్రమే ఇవ్వలేదంటూ రెండు మూడు గంటల పాటు ఏడుస్తూనే ఉందట.

దాంతో ఆమె కుటుంబ సభ్యులు యువరాజు గారి వ్యక్తిగత సిబ్బందికి ఈ విషయాన్ని తెలియజేయడం, వారు యువరాజుకు చెప్పడం జరిగింది.

తన వల్ల ఏడుస్తున్న పాపను స్వయంగా ఇంటికి వెళ్లి మరీ పలకరించాడు.కేవలం షేక్‌ హ్యాండ్‌ మాత్రమే ఇవ్వకుండా ఆ పాప చేతిని ముద్దు పెట్టుకున్నాడు.అలాగే ఆ పాపకు కూడా తన చేతిని ఇచ్చి కిస్‌ చేయించాడు.

ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అయ్యాయి.యువ రాజు గారి మంచి మనసును అంతా కూడా అభినందిస్తున్నారు.

ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ వీడియోలను మీరు ఒక సారి చూడండి.మంచి మనసున్న ఈ మహారాజును మీరు అభినందించాల్సిందిగా కోరుకుంటున్నాం.

#Abu Dhabi #AbuDhabi #GirlMeet #PrinceMeet #GirlCrying

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు