విడ్డూరం : బీరు బాటిల్స్‌ను ఇలా కూడా ఉపయోగిస్తారా?

ఎంత తెలివైన వాడైనా కూడా ఆపద సమయంలో సమయస్ఫూర్తిగా ఆలోచిస్తేనే ఆ తెలివికి అర్థం ఉంటుంది.పరీక్షల్లో వందకు వంద మార్కులు తెచ్చుకున్న వాడు చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు బయట పడలేక కిందా మీదా పడుతూ ఉంటాడు.

 Aboy Stopfire On Car With His Beernow He Is The Worldwide Viralnow-TeluguStop.com

ఆ సమయంలో అతడు కాస్త లోక జ్ఞానం ఉపయోగిస్తే బయట పడే అవకాశం ఉంటుంది.కాని అది ఎక్కువ మందికి ఉండదు.

ముఖ్యంగా ఈతరం పిల్లలకు లోక జ్ఞానం అనేది తక్కువగా ఉంటుంది.అయితే ఇప్పుడు నేను చెప్పబోతున్న వ్యక్తికి ఉన్న తెలివి గురించి ప్రపంచ వ్యాప్తంగా చర్చించుకుంటున్నారు.

Telugu Boy Car Beer, Beer Store Cars, National-

  ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థలో ప్రసారం అయిన కథనం అనుసారంగా బవేరియాలోని హెస్బాచ్‌ అనే పట్టణంలో ఒక కుర్రాడు కారులో ప్రయాణిస్తున్నాడు.అతడు ఒంటరిగా కారులో ముందుకు సాగుతున్నాడు.ఆ సమయంలో అతడి కారు ఇంజన్‌ నుండి మంటలు వచ్చాయి.అది గమనించిన ఆ కుర్రాడు వెంటనే కారును ఆపేశాడు.మంటలు ఆర్పేందుకు ప్రయత్నించాడు.మంటలు నిమిషం నిమిషంకు పెరుగుతున్నాయి.

ఆ సమయంలో అతడు తన కారులో ఉన్న బీరు సీసాలను గుర్తు చేసుకున్నాడు.

వెంటనే కారులో ఉన్న బీరు సీసాలను తీసుకుని రెండింటిని ఒకేసారి ఓపెన్‌ చేసి మంటలపై పోశాడు.

రెండు బీర్లు పోయగానే మంటలు కాస్త తగ్గాయి.మరో రెండు బీర్లకు పూర్తిగా మంటలు ఆరాయి.

కారు అగ్ని ప్రమాదం తెలిసిన అగ్నిమాపక సిబ్బంది వచ్చేప్పటికి ఆ కుర్రాడు తన కారులోని మంటలను అదుపులోకి తీసుకు వచ్చాడు.అతడి ప్రయత్నంను అభినందించిన ఫైర్‌ సిబ్బంది కారును పరిశీలించి పూర్తిగా మంటలు ఆగి పోయాయని నిర్థారణకు వచ్చిన తర్వాత అక్కడ నుండి వెళ్లి పోయారు.

Telugu Boy Car Beer, Beer Store Cars, National-

  అయిదు నిమిషాలు ఆలస్యం అయ్యి ఉంటే కారు 50 శాతం వరకు తగులబడి పోయేది.ఇంకాస్త ఆలస్యం అయితే కారు పూర్తిగా దగ్నం అయ్యేది.కాని అతడు వ్యవహరించిన తీరుకు అంతా అతడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.బీర్లను ఇలా కూడా వాడవచ్చు అంటూ నిరూపించిన అతగాడికి ప్రపంచ వ్యాప్తంగా అభినందనలు దక్కుతున్నాయి.సోషల్‌ మీడియాలో అతడి పని ప్రస్తుతం వైరల్‌ అవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube