ఆ జంతువు జీవిత‌కాలం క‌డుపుతోనే ఉంటుంది.. అదేమిటో తెలిస్తే..

భూమిపై అలాంటి జంతువు మ‌రొక‌టి ఉండ‌దు.అది ఎల్లప్పుడూ క‌డుపుతోనే ఉంటుంది.

 About Wallaby And A Kangaroo Pregnency Details, Animal Forest World Wonder, Wal-TeluguStop.com

అంటే అది ఒక పిల్ల‌ను క‌న్న‌వెంట‌నే దాని శ‌రీరంలో మరో పిండం ఏర్ప‌డుతుంది.పిల్ల‌ను క‌న్న కొన్ని రోజులకే మ‌రో పిల్ల‌ను క‌డుపులో మోస్తుంది.

మరే ఇతర జంతువుకు కూడా ఇలా జ‌ర‌గ‌దు.అదే కంగారూ జాతికి చెందిన జంతువు.

వాలబీ. చూడగానే కంగారులా ఉండే ఈ జంతువు ఎప్పుడూ గర్భంతోనే ఉంటుంది.

యూనివర్సిటీ ఆఫ్ మెల్‌బోర్న్ మరియు బెర్లిన్‌లోని లీబ్నిజ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ జూ అండ్ వైల్డ్‌లైఫ్ రీసెర్చ్ ప్రకారం.ఈ జీవి జీవితాంతం క‌డుపుతో ఉంటుంది.

ఆడ‌ వాలబీకి రెండు వేర్వేరు గర్భాశయాలు మరియు రెండు అండాశయాలు ఉంటాయి.

దీంతో రెండు కూన‌లు వాల‌బీ కడుపులోని రెండు వేర్వేరు గర్భాశయాలలో పెరుగుతూ ఉంటాయి.

ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది.అందుకే దీనిని ఎప్పుడూ క‌డుపుతో ఉంటుంద‌ని అంటారు.

ఇది కంగారు శ‌రీర వ్య‌వ‌స్థ‌లో మాత్రమే జరుగుతుందని శాస్త్ర‌వేత్త‌లు తెలిపారు.ఆడ కంగారుకి కూడా దాని శరీరంలో రెండు వేర్వేరు గర్భాశయాలు, రెండు అండాశయాలు ఉంటాయి.

అయితే ఆడ కంగారూ పిల్ల‌కు జన్మనిచ్చిన మూడు నుండి నాలుగు రోజుల తర్వాత మాత్రమే గర్భందాలుస్తుంది.అయితే ఆడ వాలబీ బిడ్డకు జన్మనిచ్చే ముందుగానే గర్భం దాలుస్తుంది.రెండవ పిండం మ‌రో గర్భాశయంలో పెరుగుతుంది.వాలబీ గర్భధారణ కాలం 30 రోజులు మాత్రమే.మొదటి కూన‌ తన క‌డుపు నుంచి బయటకు వచ్చి నడవడం ప్రారంభించే వరకు ఆడ వాలబీ త‌న కూన‌ల‌ పుట్టుకను వాయిదా వేయగలదని కూడా శాస్త్ర‌వేత్త‌లు చెబుతుంటారు.

Interesting facts about Wallabies Wallaby Facts

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube