ప్రపంచంలోనే మొదటి బిలియనీర్ గురించి మీకు తెలుసా? అత‌నేం చేసేవాడంటే..

ఫోర్బ్స్ రిచ్ లిస్ట్ ఆఫ్ ది ఇయర్‌-2020 ప్ర‌కారం ప్రపంచవ్యాప్తంగా మొత్తం 2,755 మంది బిలియనీర్లు ఉన్నారు.అయితే ఇప్పుడు ప్రపంచంలోని మొదటి బిలియనీర్ గురించి తెలుసుకుందాం.

 Do You Know About The First Billionaire In The World John D Rockfeller Details,-TeluguStop.com

అతని పేరు జాన్ డి.రాక్‌ఫెల్లర్. అమెరికన్ వ్యాపార దిగ్గజం రాక్‌ఫెల్లర్ చమురు విక్ర‌యాలు చేసేవాడు.1916లో అతను ప్రపంచంలోనే మొదటి బిలియనీర్ అయ్యాడు.1839 జూలై 8న న్యూయార్క్‌లో జన్మించిన రాక్‌ఫెల్లర్‌ను ఇప్పటికీ ఆయిల్ టైటాన్ అని పిలుస్తారు.అతను ఎప్పుడూ కష్టపడి పనిచేసే వ్యాపారవేత్తగా గుర్తింపు పొందారు.16 సంవత్సరాల వయస్సులో అతను హెవిట్ అండ్‌ టటిల్‌లో అసిస్టెంట్ బుక్ కీపర్‌గా పనిచేశాడు.

తరువాత కమీషన్ వ్యాపారిగా, రవాణాదారుగా పనిచేశారు.

ఆయ‌న రాక్‌ఫెల్లర్ స్టాండర్డ్ ఆయిల్ కంపెనీ వ్యవస్థాపకుడు.ఆ కంపెనీ చమురు వ్యాపారంలో కొత్త రికార్డులను సృష్టించింది.

రాక్‌ఫెల్లర్ 1870లో స్టాండర్డ్ ఆయిల్ కంపెనీని ప్రారంభించాడు.పరిశ్రమలో తన గుత్తాధిపత్యాన్ని సొంతం చేసుకున్నాడు.1911లో స్టాండర్డ్ ఆయిల్ కంపెనీ నిబంధనలను ఉల్లంఘించిందని యూఎస్‌ సుప్రీం కోర్ట్ చెప్ప‌డంతో ఈ కంపెనీని మూసివేయాల్సి వ‌చ్చింది.

1913లో రాక్‌ఫెల్లర్ ఆస్తులు 900 మిలియన్ డాల‌ర్లు.1937 నాటికి రాక్‌ఫెల్లర్ సంపద 1.4 బిలియన్ డాల‌ర్లు.జాన్ డి రాక్‌ఫెల్లర్ త‌న‌ 97 సంవత్సరాల వయస్సులో 1937 మే 23న మరణించారు.నేటికీ అతని కుటుంబం అమెరికాలోని అత్యంత సంపన్న కుటుంబాల జాబితాలోకి వస్తుంది.

రాక్‌ఫెల్లర్ కుటుంబం ఇప్పటికీ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలలో మొదటి హోదాను అందుకుంటోంది.

First Billionaire in the World John D Rockefeller

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube