శ్యామల ఎలిమినేషన్‌ విషయంలో కూడా నూతన్‌ నాయుడు తరహా విధానం..  

About Shyamala Elimination In In Bigg Boss 2-

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 2 ముగింపు దశకు చేరుకుంది.మరో రెండు వారాలు మాత్రమే మిగిలి ఉన్న ఈ రెండవ సీజన్‌ నుండి తాజాగా నిన్నటి ఆదివారం శ్యామల ఎలిమినేట్‌ అయ్యింది.రీ ఎంట్రీ ఇచ్చిన శ్యామల మంచి ఎనర్జిటిక్‌ ఫర్మార్మెన్స్‌తో అందరిని అలరించింది.ఎలిమినేషన్స్‌కు ఇంటి సభ్యులు అంతా కూడా శ్యామలను నామినేట్‌ చేయడం జరిగింది..

About Shyamala Elimination In In Bigg Boss 2--About Shyamala Elimination In Bigg Boss 2-

శ్యామల రీ ఎంట్రీ కారణంగానే ఆమెను నామినేట్‌ చేస్తున్నట్లుగా అంతా చెబుతూ వచ్చారు.

ఇక బిగ్‌బాస్‌ నిర్వాహకులు కూడా శ్యామల రీ ఎంట్రీ ఇచ్చింది అనే కారణంగా ఎలిమినేట్‌ చేశారు అంటూ విమర్శలు వస్తున్నాయి.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం అమిత్‌ తివారి కంటే శ్యామలకు ఎక్కువ ఓట్లు వచ్చాయి.కాని రీ ఎంట్రీ ఇచ్చిన వారిని ఫైనల్‌కు ఉంచకూడదు అనే ఉద్దేశ్యంతో నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం అందుతుంది.

బిగ్‌బాస్‌ లో గత వారం నూతన్‌ నాయుడును ఎలిమినేట్‌ చేసిన విషయం తెల్సిందే.రెండు సార్లు రీ ఎంట్రీ ఇచ్చాడన్న ఒకే ఒక్క కారణంతో ఎక్కువ ఓట్లు వచ్చినా కూడా నూతన్‌ నాయుడును ఎలిమినేట్‌ చేయడం జరిగిందని సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి..

నూతన్‌ నాయుడు విషయంలో జరిగిందే ఇప్పుడు శ్యామల విషయంలో కూడా జరిగి ఉండవచ్చు అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.నూతన్‌ నాయుడుకు ఎలాగైతే మంచి ఓట్లు వచ్చాయో అచ్చు అలాగే శ్యామలకు కూడా అమిత్‌కు మించి వచ్చాయి.

బుల్లి తెరపై మంచి ఫాలోయింగ్‌ ఉన్న శ్యామలకు అమిత్‌ కంటే తక్కువ ఓట్లు రావడం ఏంటీ అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.ఇప్పటికే పలు వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్న బిగ్‌బాస్‌ టీం మరోసారి శ్యామలను ఎలిమినేట్‌ చేయడం ద్వారా మరో వివాదానికి తెర లేపారు అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి..

ఇంట్లో వైల్డ్‌ కార్డు ఎంట్రీస్‌, రీ ఎంట్రీ ఇచ్చిన వారు లేకుండా, ఫైనల్‌ నిర్వహించాలని, అందుకే ఇలా చేసినట్లుగా కొందరు అంచనా వేస్తున్నారు.

ఫైనల్‌కు వెళ్లే వారు డే 1 నుండి ఉన్న వారే అయ్యి ఉండాలని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అందుకే బిగ్‌బాస్‌ నిర్వాహకులు నూతన్‌ నాయుడు మరియు శ్యామలను ఎలిమినేట్‌ చేయడం జరిగింది.