వైరల్: మూడు చేతులు, రెండు తలలతో జన్మించిన కవలలు..!- Abnormal Twins With Three Hands And Two Heads Born In Odisha

abnormal twins with three hands and two heads born in odisha , twins, viral news, odisha, india, 3 hands, 2 heads, abnormal twins, odisha, private hospital , three hands, two heads, abhivruddhi sishu bhavan, treatment, no guarantee of life - Telugu 2 Heads, 3 Hands, Abhivruddhi Sishu Bhavan, Abnormal Twins, India, No Guarantee Of Life, Oddissa, Odisha, Private Hospital, Three Hands, Treatment, Twins, Two Heads, Viral News

ప్రపంచంలో అనేక సార్లు కొందరు పుట్టుకలో వారి జన్యు లోపం వలన, మరేదో లోపం వలన కొంత మంది పిల్లలు మామూలు మనుషుల కాకుండా కొన్ని అవయవాలు ఎక్కువగా ఉండటం లేదా తక్కువగా ఉండటం ఉండి పుట్టడం మనం వార్తల్లో చూస్తూనే ఉంటాం.అయితే తాజాగా ఒడిస్సా లో ఓ సంఘటన చోటు చేసుకుంది.

 Abnormal Twins With Three Hands And Two Heads Born In Odisha-TeluguStop.com

ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.ఒడిస్సా రాష్ట్రానికి చెందిన ఓ మహిళ ఆదివారం కవలలకు జన్మనిచ్చిన ఆ కవలలు అభివక్త కవలలు కావడం అందులో విశేషం.

అయితే ఈ అభివక్త కవలలు పుట్టుకతోనే వారి ఇద్దరి శరీరాలు అతుక్కొని పుట్టడం మాత్రమే కాకుండా వారికి రెండు తలలు ఏర్పడగా కేవలం మూడు చేతులతోనూ వారు జన్మించారు.ఒరిస్సా రాష్ట్రంలోని కేంద్రపర జిల్లాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో మహిళ ఈ బిడ్డలకు జన్మ ఇచ్చింది.

 Abnormal Twins With Three Hands And Two Heads Born In Odisha-వైరల్: మూడు చేతులు, రెండు తలలతో జన్మించిన కవలలు..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇకపోతే ఈ కవలలకు రెండు తలలు ఉన్న గాని కేవలం మూడు చేతులే ఉన్నాయని డాక్టర్లు తెలిపారు.

వీటితో పాటు వీరికి శరీరం ఒకటి మాత్రమే ఉందని డాక్టర్లు తెలియజేశారు.

ఈ కేసును సీరియస్ గా తీసుకున్న డాక్టర్లు తదుపరి చికిత్స కోసం ఆ అభివృద్ధి శిశు భవన్ కి తరలించినట్లు తెలిపారు.అయితే ఇలా జన్మించిన పిల్లలు సాధారణ జీవితం జీవించడం చాలా కష్టమైన ప్రక్రియ అని అంతేకాకుండా వారు ఎక్కువ కాలం బతుకుతారని గ్యారెంటీ కూడా లేదని డాక్టర్లు తెలిపారు.

అయితే స్త్రీ గర్భంలో పిండం సరిగా అభివృద్ధి చెందకపోవడం కారణంతో ఇలాంటి జననాలు కూడా సంభవిస్తాయని వారు తెలిపారు.పది లక్షల మందిలో ఇలా ఒకరికి సంభవిస్తుందని వైద్యులు చెప్పుకొచ్చారు.

చూడాలి మరి చివరికి ఈ అభివక్త కవలలు ఏమవుతారో.

#Abnormal Twins #2 Heads #Twins #India #NoGuarantee

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు