పవన్ కి దిమ్మతిరిగిపోయే షాక్ ఇచ్చిన “ఆర్కే”     2017-12-10   21:30:39  IST  Bhanu C

పవన్ కళ్యాణ్ ఎప్పుడు తన క్రేజ్ తగ్గిపోతుందో..అప్పుడు జూలు విదుల్చుతాడు..అప్పటి వరకు ఉన్న సినిమా గెటప్ సెటప్ అమాంతం మార్చేసుకుని..పేస్ లో ఉండే ఫీలింగ్స్ అన్ని చేంజ్ చేసుకుని..లూజు లాల్చి..పాత కాల ఫ్యాంట్ కట్ తో తానొక గొప్ప మేధావి అనేలా..ప్రజా పోరాట నాయకుడు అనే బిల్డప్ తో జనాల ముందుకు వచ్చేస్తుంటాడు..అంతేనా ఈ మధ్య వాళ్ళు వీళ్ళు అనే భేదం లేదు ఎవరి మీద పడితే వారి మీద విరుచుకుని పడిపోతున్నాడు..వాడికి ఎవడైనా చెప్పండ్రా అని అందామా అంటే తనకి తానూ తిక్క ఉంది అని ఎప్పటికప్పుడు చెప్పడంతో..ఆ దిశగా ఎవరు ధైర్యం చేయలేకపోతున్నారు…ఇప్పుడు బయట ఫుల్ టాక్..అయితే ఈ మధ్య పవన్ ఒక వ్యక్తీ మీద అదీ కూడా మీడియా అధినేత మీద కామెంట్స్ చేయడంతో..పవన్ తిక్క తీర్చేస్తున్నాడు సదరు మీడియా ఎండీ..విషయం లోకి వెళ్తే

పవన్ కళ్యాణ్ ఎప్పుడు సంచలనం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు..తిక్క తిక్క అరుపులతో జనాలని ఆకట్టుకోవాలి అనేది తన టార్గెట్ ఈ టార్గెట్ లో ముందుగా జగన్ ని ఎంచుకుని అవినీతి అంటూ భారీ డైలాగులే కొట్టాడు..ప్రజలు చప్పట్లు కొట్టారు..తరువాత చంద్రబాబు..కొత్త పార్టీగా చంద్రబాబు ని ఏవో రెండు మాటలు అనకపోతే ప్రజలు ఫీల్ అవుతారు అని రెండు మాటలు మాట్లాడాడు..ఆ తరువాత పవన్ టార్గెట్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ మీద పడింది తనదైన శైలిలో విరుచుకుపడిపోయాడు. అసలు ఏపీలో ఉన్న అన్ని మీడియా సంస్థల కంటే కూడా పవన్ టూర్ ని ఎక్కువగా కవర్ చేసింది రాధాకృష్ణ నే..ఎప్పుడూ లేని విధంగా ఓ పేజీ మొత్తం పవన్ కు కేటాయించింది.

అలాంటిది పవన్ ఆంధ్రజ్యోతిపై తిరుగుబాటు చేయటంతో చిర్రెత్తుకొచ్చిన ఆర్కే పవన్..పర్యటనలో కాపు కులం వాళ్లే ఉన్నారని చెప్పడంతో ఖంగారు పడిన పవన్..నేను మా అన్నయ్య అంత మెతక కాదు నాకు కులం మరక అంటిస్తే చూస్తూ ఊరుకోను అంటూ వార్నింగ్ ఇచ్చినంత పని చేశారు…తనకు డ్యామేజ్ కలిగేలా చేసేందుకు ఆర్కే ప్రయత్నిస్తున్నారన్న భావనతో ఉన్న పవన్ తన ఆగ్రహాన్ని ప్రదర్శించారు. పవన్ వ్యాఖ్యలతో ఖంగుతిన్న ఆర్కే పవన్ కి ధీటుగా ఇదే నా సమాధానం అన్నట్టుగా..పవన్ పర్యటన కవరేజ్ ని బాగా తగ్గించేసి పవన్ తిక్క తీర్చేశాడు… అంతేకాదు పవన్ కి మీడియా కవరేజ్ విషయంలో కూడా ఆర్కే సాయం అంతంత మాత్రమె అని టాక్. మొత్తానికి ఆది లోనే పవన్ ఒక మీడియాకి వ్యతిరేకి అయ్యాడు..మరి ముందు ముందు మరిన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.