బిగ్ బాస్ విన్నర్ అభిజిత్ కు నాగార్జున బంపర్ ఆఫర్..

బిగ్ బాస్ రియాలిటీ షో ఎంత హిట్ అయ్యిందో అందరికి తెలిసిన విషయమే.ఈ మధ్యనే బిగ్ బాస్ సీజన్ తెలుగు 4 పూర్తి చేసుకుంది.

 Abijeet Three Film Deal With Annapurna Studios-TeluguStop.com

ఈ సీజన్ కు నాగార్జున హోస్ట్ గా వ్యవహరించారు.త్వరలోనే సీజన్ 5 కూడా ప్రారంభం చేయబోతున్నట్లు ఇప్పటికే వార్తలు వస్తున్నాయి.

అయితే బిగ్ బాస్ 4 తెలుగు సీజన్ విన్నర్ అయిన అభిజిత్ బయటకు వచ్చిన తర్వాత కొన్ని రోజులుగా సైలెంట్ గా ఉంటున్నాడు.

 Abijeet Three Film Deal With Annapurna Studios-బిగ్ బాస్ విన్నర్ అభిజిత్ కు నాగార్జున బంపర్ ఆఫర్..-Gossips-Telugu Tollywood Photo Image-TeluguStop.com

బిగ్ బాస్ ద్వారా అభిజిత్ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు.

బిగ్ బాస్ ముందు అభిజిత్ పెద్దగా ఎవ్వరికి తెలియదు.కానీ ఇప్పుడు జనాల్లో ఆయనకు మంచి ఇమేజ్ ఉంది.

ఆ మంచి ఇమేజ్ తోనే బిగ్ బాస్ టైటిల్ విన్నర్ గా నిలిచాడు.బిగ్ బాస్ తర్వాత కొన్ని ఇంటర్వూస్ ఇచ్చి తర్వాత బయట కనిపించడమే మానేసాడు.

బిగ్ బాస్ కు రాక ముందు అభిజిత్ సినిమాలు చేసిన పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయాడు.సినిమాల్లో గుర్తింపు రాక ఆ మధ్య ఒక వెబ్ సిరీస్ కూడా చేసాడు.పెళ్లి గోల అనే వెబ్ సిరీస్ లో అభిజిత్ వర్షిణి కలిసి జంటగా నటించారు.ఆ వెబ్ సిరీస్ కు మంచి స్పందన వచ్చింది.తర్వాత బిగ్ బాస్ లో ఎంట్రీ ఇచ్చాడు.అయితే పెద్ద అంచనాలు లేకుండా వచ్చి తన ఆటతో ప్రేక్షకులను మెప్పించాడు.

అయితే అభిజిత్ తన ఫాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పబోతున్నాడట.అన్నపూర్ణ స్టూడియోస్ అభిజిత్ ను సంప్రదింపులు జరిపారని సమాచారం.అంతేకాదు ఈయన మూడు సినిమాలు కూడా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.అన్నపూర్ణ స్టూడియోస్ వారు కొత్త దర్శకులతో త్వరలో మూడు సినిమాలు చేయబోతున్నారట.

మూడు సినిమాల కోసం అభిజిత్ తో డీల్ కుదుర్చుకున్నారని టాలీవుడ్ వర్గాల్లో వార్తలు వస్తున్నాయి.మొత్తానికి అభిజిత్ కు నాగార్జున బంపర్ ఆఫర్ ఇచ్చాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.

#Pelli Gola #Abijeet #AbijeetBigg #Nagarjuna #Varshini

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు