అలాంటి సమస్యతో బిగ్ బాస్ విన్నర్.. సినిమాలకు దూరంగా?

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా హీరోగా పరిచయమైన అభిజిత్ ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి, తనదైన శైలిలో కంటెస్టెంట్ లతో వ్యవహరిస్తూ మిస్టర్ కూల్ అనే బిరుదును సంపాదించుకుని బిగ్ బాస్ సీజన్ ఫోర్ విన్నర్ గా టైటిల్ గెలుచుకున్నారు.బిగ్ బాస్ ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న అభిజిత్ బిగ్ బాస్ తర్వాత వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతారని అభిమానులు భావించారు.

 Abijeet Is Suffering With Health Issues Abijeet, Health Issues, Bigg Boss, Socia-TeluguStop.com

ఈ క్రమంలోనే అభిజిత్ సినిమా ఎప్పుడు ప్రకటిస్తారా అంటూ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

బిగ్ బాస్ తర్వాత అభిజిత్ 3 సినిమాల స్క్రిప్టులు వింటున్నానని, త్వరలోనే వాటి గురించి అధికారికంగా ప్రకటిస్తామని వెల్లడించారు.

అయితే బిగ్ బాస్ సీజన్ ఫోర్ విన్నర్ గా గెలిచిన అభిజిత్ బిగ్ బాస్ సీజన్ ఫైవ్ మొదలైన కూడా ఇప్పటివరకు ఎలాంటి సినిమా ప్రకటన చేయకపోవడంతో అభిమానులు ఎంతో నిరాశ చెందారు.బిగ్ బాస్ సీజన్ ఫోర్ కంటెస్టెంట్ గా వెళ్ళిన అఖిల్, సోహైల్, హారిక, మోనాల్ వంటి వారు ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకొని ప్రస్తుతం వరుస అవకాశాలతో ఎంతో బిజీగా ఉన్నారు.

Telugu Abijeet, Bigg Boss, Beautiful, Tollywwod-Movie

బిగ్ బాస్ సీజన్ ఫోర్ టైటిల్ కైవసం చేసుకున్న అభిజిత్ మాత్రం ఇప్పటివరకు ఒక్క సినిమాని కూడా ప్రకటించ పోవడానికి తన ఆరోగ్యం సరిగా లేకపోవడం వల్ల ఇప్పటి వరకు ఎలాంటి సినిమా ప్రకటించలేదని, తన కాలు సర్జరీ కి సంబంధించిన రిపోర్టులను కూడా పెట్టారు.ఈ క్రమంలోనే అభిజిత్ ఇప్పుడు కూడా ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నట్లు తెలుస్తోంది.తాజాగా

సోషల్ మీడియా

వేదికగా లైవ్ లోకి వచ్చిన అభిజిత్ ను నెటిజన్లు వివిధ రకాల ప్రశ్నలు అడిగారు.ఈ క్రమంలోనే తనకు సినిమాలకన్నా ఆరోగ్యం ఎంతో ముఖ్యమని అభిజిత్ సమాధానం చెప్పడంతో ఇప్పుడప్పుడే అభిజిత్ సినిమా ఉండబోదని నెటిజన్లు భావిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube