పదో తరగతి ఫెయిలైన అభిషేక్ బచ్చన్.. కానీ..?

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కుమారుడు అభిషేక్ బచ్చన్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి చాలా సంవత్సరాలే అయినా ఆయన సినీ కెరీర్ లో చెప్పుకోదగ్గ సినిమాలు లేవనే సంగతి తెలిసిందే.అయితే అభిషేక్ బచ్చన్ మాత్రం వరుసగా సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు.

 Abhishek To Paly 10th Fail Chief Minister In Dasvi-TeluguStop.com

ప్రస్తుతం అభిషేక్ బచ్చన్ దస్వీ అనే సినిమాలో నటిస్తుండగా ఈ సినిమాలో పదోతరగతి ఫెయిలైన సీఎం పాత్రలో అభిషేక్ నటిస్తూ ఉండటం గమనార్హం.

ఈ సినిమాలలో కామెడీకి ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది.

 Abhishek To Paly 10th Fail Chief Minister In Dasvi-పదో తరగతి ఫెయిలైన అభిషేక్ బచ్చన్.. కానీ..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

పొలిటికల్ హ్యూమర్ తో తెరకెక్కనున్న ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.ఈ సినిమా నిర్మాతలు నిర్మించిన ఆంగ్రేజీ మీడియమ్, హిందీ మీడియమ్.

ఇతర సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లు కావడం గమనార్హం.దస్వీ మూవీలో అభిషేక్ గంగారామ్ చౌదరి అనే పాత్రలో నటిస్తున్నారు.

ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమా ఈ ఏడాది సెకండాఫ్ లో విడుదల కానుంది.

Telugu 10th Fail, Abhishek Bachan, Chief Minister, Dasvi-Movie

ఈ సినిమాకు తుషార్ జలోటా అనే కొత్త డైరెక్టర్ డైరెక్షన్ చేస్తున్నారు.సమాజంలో నేటికీ చాలామంది పిల్లలు విద్యకు దూరమవుతున్న నేపథ్యంలో ఈ సినిమా ద్వారా చదువు పిల్లలకు ఎంత ముఖ్యమో తెలపడంతో పాటు చదువు గొప్పదనాన్ని నిర్మాతలు ప్రేక్షకులకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు.ఈ సినిమా అభిషేక్ బచ్చన్ భారీ బ్లాక్ బస్టర్ హిట్ ఇస్తుందో లేదో చూడాల్సి ఉంది.

యూనిక్ కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కనుండటంతో బాలీవుడ్ లో ఈ సినిమా సక్సెస్ అయితే ఇతర భాషల్లో కూడా ఈ సినిమా రీమేక్ అయ్యే అవకాశం ఉంది.అయితే కొందరు నెటిజన్లు మాత్రం అభిషేక్ కు పొలిటికల్ హ్యూమర్ సబ్జెక్టులతో పోలిస్తే సీరియస్ రోల్స్ బాగా సూటవుతాయని చెబుతున్నారు.

పదో తరగతి ఫెయిలైన సీఎం పాత్రలో అభిషేక్ మెప్పిస్తాడో లేదో చూడాల్సి ఉంది.

#Dasvi #10th Fail #Abhishek Bachan #Chief Minister

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు