ఈ ఫోటోలో ఉన్న హీరో ఎవరో గుర్తుపట్టారా?

ఫుల్ స్లీవ్స్ చొక్కా ధరించి, పెద్ద కళ్ళజోడు పెట్టుకొని, మిడ్‌ పార్టీషియన్‌ జుట్టుతో ఉన్న ఈ హీరో ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.ఇంత డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్న ఈ హీరో ఎవరనుకుంటున్నారా? మన బాలీవుడ్ టాప్ మోస్ట్ హీరోలలో ఒకరైన అభిషేక్ బచ్చన్.అయితే అభిషేక్ బచ్చన్ తాజాగా నటిస్తున్న కహానీ త్రిల్లర్ మూవీ చిత్రం షూటింగ్ కోసం ఈ విధమైన లుక్ లో మనకు కనిపించారు.

 Abhishek Bachchan Shoots Bob Biswas Kolkata Pics Go Viral,abhishek Bachchan, Sho-TeluguStop.com

సుజోయ్ ఘోష్ దర్శకత్వంలో వచ్చిన కహానీ సినిమాలోని కోల్డ్‌ బ్లడెడ్‌ కిల్లర్‌గా బిస్వాస్‌ పాత్రపై ప్రేక్షకులు తీవ్ర ప్రశంసల వర్షం కురిపించారు.

ఈ పాత్రను సస్వతా ఛటర్జీ  పోషించగా….ప్రస్తుతం ఈ పాత్రలో అభిషేక్ బచ్చన్ నటించనున్నారు.ఈ పాత్ర కోసం అభిషేక్ బచ్చన్ తన లుక్ మొత్తం మార్చేసాడు.ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారి అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

Telugu Biswas, Blooded Killer, Kolkata-Movie

ఈ చిత్ర నిర్మాణం ఈ ఏడాది జనవరి లోనే మొదలైంది.కరోనా కారణం వల్ల ఈ సినిమా షూటింగ్ ఆగిపోవడంతో, ప్రస్తుతం తిరిగి కరోనా నిబంధనలు పాటిస్తూ కేవలం అతి కొద్ది మంది సమక్షంలో చిత్ర నిర్మాణం చేపడుతున్నారు.ఇప్పటికే అభిషేక్ బచన్ కరోనా బారిన పడి తిరిగి కోలుకున్న సంగతి మనకు తెలిసినదే.అందుకోసమే తగినంత జాగ్రత్తలను పాటిస్తూ ఈ చిత్ర నిర్మాణం ఇప్పటికే కలకత్తాలో ప్రారంభమయింది.

యాక్షన్ థ్రిల్లర్ సినిమాను షారుక్ ఖాన్ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తుండగా, ప్రముఖ దర్శకుడు అయిన సుజోయ్‌  ఘోష్ కుమార్తె డియా అన్నపూర్ణ ఘోష్ దర్శకురాలిగా ఈ సినిమాతో పరిచయం కానున్నారు.ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన అభిషేక్ బచ్చన్ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube