పెను గండం నుంచి బయటపడ్డ సురేష్ బాబు చిన్న కొడుకు  

abhiram daggubati car accident at manikonda, Tollywood, Daggubati Rana, Suresh Babu - Telugu Abhiram Daggubati Car Accident At Manikonda, Daggubati Rana, Suresh Babu, Tollywood

దగ్గుబాటి ఫ్యామిలీలో కొద్ది రోజుల క్రితం రానా పెళ్లి వేడుకతో శుభకార్యం జరిగింది.ఇప్పుడు అందరూ సంతోషకరమైన వాతావరణంలో ఉన్నారు.

TeluguStop.com - Abhiram Daggubati Car Accident At Manikonda

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

ఇలాంటి సమయంలో అనుకోని విషాదం నుంచి దగ్గుబాటి ఫ్యామిలీ బయటపడింది.రానా తమ్ముడు అయిన అభిరామ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

TeluguStop.com - పెను గండం నుంచి బయటపడ్డ సురేష్ బాబు చిన్న కొడుకు-General-Telugu-Telugu Tollywood Photo Image

శ్రీ రెడ్డి ఇష్యూలో టాలీవుడ్ లో ఎక్కువగా ఫోకస్ అయ్యింది అభిరామ్ అనే విషయం అందరికి తెలిసిందే.ఇక చిన్న కొడుకుని హీరోగా పరిచయం చేయడానికి సురేష్ బాబు కూడా ఇప్పటి నుంచి ప్లాన్ చేస్తున్నాడు.

దాని కోసం అతనికి ప్రత్యేకంగా యాక్టింగ్ శిక్షణ కూడా ఇప్పించారు.అలాగే బాడీ లాంగ్వేజ్, యాక్షన్, డాన్స్ నేర్చుకోవడానికి విదేశాలు పంపించారు.

***

త్వరలో అతని అరంగేట్రానికి సురేష్ బాబు ప్లాట్ ఫామ్ సిద్ధం చేస్తున్నారు.ఇదిలా ఉంటే తాజాగా ఊహించని ప్రమాదం నుంచి అభిరామ్ తృటిలో తప్పించుకున్నాడు.

అభిరామ్ దగ్గుబాటి ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది.సైబరాబాద్ పరిధిలోని మణికొండలో అభిరామ్ ప్రయాణిస్తోన్న కారుకు త‌ృటిలో పెను ప్రమాదం తప్పింది.మణికొండలోని పంచవటి కాలనీలో అభిరామ్ ప్రయాణిస్తోన్న కారును ఎదురుగా వచ్చిన మరో కారు ఢీ కొట్టడంతో ఈ యాక్సిడెంట్ జరిగింది.ఇది మాములుగా జరిగిన ప్రమాదమేనని ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం కానీ, గాయాలు కానీ కాలేదని పోలీసులు తెలిపారు.

దీంతో పెద్ద గండం నుంచి అభిరామ్ దగ్గుబాటి క్షేమంగా బయటపడ్డాడని కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.శుభకార్యం జరిగిన రెండు రోజులకి ఈ సంఘటన జరగడంతో ఒక్కసారిగా దగ్గుబాటి ఫ్యామిలీలో అందరూ కలవరానికి గురయ్యారు.

#Daggubati Rana #Suresh Babu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Abhiram Daggubati Car Accident At Manikonda Related Telugu News,Photos/Pics,Images..