వైరల్‌ : పాక్‌కు బుద్ది వచ్చిందా, అక్కడ మ్యూజియంలో మన అభినందన్‌ విగ్రహం ఏంటో!?  

Abhinandan\'s Mannequin Display At Paf Museum-abhinandan\\'s Mannequin,nri,paf Museum,pakistan Put Abhinandan\\'s Mannequin,telugu Nri News Updates,viral In Social Media

ప్రస్తుతం ఇండియా పాకిస్తాన్‌ మద్య యుద్ద వాతావరణం నెలకొన్న విషయం తెల్సిందే.చాలా ఏళ్లుగా కొనసాగుతున్న ఈ పరిస్థితులకు ఒక ఫుల్‌ స్టాప్‌ పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నా ఏదో ఒక కారణంగా మళ్లీ యుద్ద మేఘాలు కమ్ముకుంటున్నాయి.ఇలాంటి నేపథ్యంలో భారత వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌ విగ్రహంను పాకిస్తాన్‌లోని కరాచీ మ్యూజియంలో పెట్టడం జరిగింది.పాకిస్తాన్‌లో ఇండియన్‌ విగ్రహం అది కూడా వింగ్‌ కమాండర్‌ విగ్రహం పెట్టడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం అవుతుంది.

Abhinandan\'s Mannequin Display At Paf Museum-abhinandan\'s Mannequin,nri,paf Museum,pakistan Put Abhinandan\'s Mannequin,telugu Nri News Updates,viral In Social Media Telugu Viral News-Abhinandan's Mannequin Display At PAF Museum-Abhinandan\'s Nri Paf Museum Pakistan Put Abhinandan\'s Telugu Nri News Updates Viral In Social Media

పాకిస్తాన్‌ యుద్ద విమానాలను కూల్చి పొరపాటున పాక్‌ భూ భాగంలోకి వెళ్లిన వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ చాలా సేఫ్‌గా ఇండియా తిరిగి వచ్చాడు.అభినందన్‌పై ఆ దేశ పౌరులు దాడి చేసేందుకు ప్రయత్నించడంతో పాటు కొందరు ఏకంగా చంపేందుకు కూడా వెనుకాడలేదు.ఇండియాకు అతడిని అప్పగించే విషయమై చాలా చర్చలు జరిగాయి.చాలా మంది విడుదలకు నో చెబితే కొందరు మాత్రం ఇండియాతో మరింత శత్రుత్వం అనవసరం అనే ఉద్దేశ్యంను వ్యక్తం చేశారు.

మొత్తానికి అభినందన్‌ను వారు ఒక శత్రు దేశపు వ్యక్తిగా చూశారు.కాని అనూహ్యంగా కరాచీలో ఒక మ్యూజియంలో అభినందన్‌ విగ్రహంను ఏర్పాటు చేయడంపై సర్వత్రా ఆసక్తికర చర్చ జరుగుతోంది.ఆ మ్యూజియంలో అభినందన్‌ విగ్రహంను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏం వచ్చింది.అసలు దీని వెనుక ఉద్దేశ్యం ఏంటీ అంటూ సోషల్‌ మీడియాలో చర్చ జరుగుతోంది.

పాకిస్తాన్‌కు చెందిన ఒక జర్నలిస్ట్‌ ఈ ఫొటోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు.తద్వార ఈ విషయం బయటకు వచ్చింది.సోషల్‌ మీడియాలో రకరకాలుగా ఈ విషయమై చర్చ జరుగుతోంది.