అభిజిత్‌, అఖిల్‌ల మద్య గొడవ సమసిపోయింది  

తెలుగు బిగ్‌బాస్‌ ముగింపు దశకు వచ్చింది.మొదటి నుండి ఇప్పటి వరకు కూడా అఖిల్‌ మరియు అభిజిత్‌ల మద్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి.

TeluguStop.com - Abhijith Vs Akhil May Be Ended

ఇద్దరు కూడా మోనాల్‌ విషయంలో ఆ తర్వాత పలు విషయాల్లో గొడవ పడుతూనే ఉన్నారు.వీరిద్దరి గొడవ పతాక స్థాయికి చేరడంతో ఇద్దరు కూడా ఒకరిని ఒకరు ఎన్నో సార్లు నామినేట్‌ చేసుకుంటూ వచ్చారు.

ఎట్టకేలకు అభిజిత్‌ మరియు అఖిల్‌ల మద్య గొడవ సమసి పోయినట్లుగా అనిపిస్తుంది.గొడవ సమసి పోకున్నా కూడా ఇంకా పోరాడే ఓపిక లేదు అన్నట్లుగా అభిజిత్‌ ఒక మంచి నిర్ణయాన్ని తీసుకున్నాడు.

TeluguStop.com - అభిజిత్‌, అఖిల్‌ల మద్య గొడవ సమసిపోయింది-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఈ వారం బిగ్‌బాస్‌ ఎలిమినేషన్‌ నామినేషన్‌ పక్రియలో భాగంగా తన ఆప్త మిత్రురాలు అయిన హారికను నామినేట్‌ చేశాడు తప్ప అఖిల్‌ వైపు వెళ్లలేదు.

అఖిల్‌ కూడా చాలా రోజులుగా పులిహోర కలుపుతున్న మోనాల్‌ ను నామినేట్‌ చేశాడు తప్ప అభిజిత్‌ వైపు వెళ్లలేదు.

ఇద్దరి మద్య ముందే ఏదో చర్చ జరిగినట్లుగా అనిపించింది.మొత్తానికి బిగ్‌ బాస్‌ లో వీరిద్దరి గొడవ తగ్గడం ప్రేక్షకులకు కాస్త ఊరటను ఇచ్చే విషయం.ఇదే సమయంలో అఖిల్‌ మరియు మోనాల్‌ మరియు మోనాల్‌ అవినాష్‌ ల మద్య గొడవ శృతి మించింది.ఆ కారణంగా మళ్లీ షో రచ్చ రచ్చగా కొనసాగుతుతోంది.

పెద్ద ఎత్తున బిగ్‌ బాస్‌ క్రియేటివ్‌ టీమ్‌ గొడవలు పెట్టేందుకు ప్రయత్నించినా.ఫిజికల్‌గా టాస్క్‌ అయ్యేలా చేసినా కూడా ఇంటి సభ్యులు మాత్రం చాలా ఓపికగా ఆడుతు వచ్చారు.

అయితే నేడు పాల టాస్క్‌ మాత్రం హింసాత్మకం అవుతున్నట్లుగా అనిపిస్తుంది.ఫినాలే మెడల్‌ కోసం ఈ సీజన్‌ లో మొదటి ఫైనల్‌ కంటెస్టెంట్‌ అవ్వడం వల్ల టాస్క్‌ లో హోరా హోరీ పోరాటం చేస్తున్నారు.

#Nagarjuna

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు