స్వాతి రాక‌తో మోనాల్ ఔట్‌‌.. అఖిల్ కూడా రూటు మార్చేశాడుగా?  

abhijith akhil trying to impress swathi deekshith in bigg boss! abhijith, akhil, swathi deekshith, bigg boss, boss 4 telugu, latest news, monal gajjar - Telugu Abhijith, Akhil, Bigg Boss, Boss 4 Telugu, Latest News, Monal Gajjar, Swathi Deekshith

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ నాల్గువ సీజ‌న్ మూడో వారాలు కంప్లీట్ చేసుకుని.ఇటీవ‌ల నాల్గువ వారంలోకి అడుగు పెట్టింది.

TeluguStop.com - Abhijith Akhil Impress Swathi Deekshith Bigg Boss

ఇప్ప‌టికే నాల్గువ వారంలో నామినేష‌న్స్ పూర్తి కాగా.స్వాతి దీక్షిత్, అభిజిత్, లాస్య, మెహబూబ్, కుమార్ సాయి, సొహైల్‌, హారిక ఎలిమినేష‌న్‌కు నామినేట్ అయ్యారు.

ఇక నాల్గువ వారం వ‌చ్చే స‌రికి ఇంటి స‌భ్యులంద‌రూ ఫుల్ యాక్టివ్ అయ్యి.బిగ్ బాస్ హౌస్‌ను ర‌స‌వ‌త్త‌రంగా మారుస్తున్నారు.

TeluguStop.com - స్వాతి రాక‌తో మోనాల్ ఔట్‌‌.. అఖిల్ కూడా రూటు మార్చేశాడుగా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఇదిలా ఉంటే.వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన స్వాతి దీక్షిత్ వ‌ల్ల మోనాల్‌కు పెద్ద చిక్కు వచ్చి ప‌డింద‌ని చెప్పాలి.

ఎందుకంటే. స్వాతి దీక్షిత్ రాక‌ముందు ఓవైపు అఖిల్‌.మ‌రోవైపు అభిజిత్‌ల‌తో ఫుల్ టైమ్ స్పెండ్ చేసేది.అయితే ఎప్పుడైతే స్వాతి దీక్షిత్ బిగ్ బాస్ హౌస్‌లో అడుగు పెట్టిందో.

అప్ప‌టి నుంచి పులిహోర రాజాగా పేరు తెచ్చుకున్న అభిజిత్ మోనాల్‌ను ప‌క్క‌న పెట్టేశాడు.ఇక తాజాగా అఖిల్ కూడా రూటు మార్చేశాడు.

నిన్న జ‌రిగిన ఎపిసోడ్‌లో అఖిల్‌, మోనాల్‌, స్వాతి ముగ్గురూ కూర్చోగా.అఖిల్ స్వాతితో మాట‌లు క‌లిపాడు.
దాంతో మోనాల్‌ అక్కడ నుండి లేచి వెళ్లిపోయింది.ఇక మోనాల్ వెళ్లిపోయాక‌.ఇంత అందంగా ఎలా ఉండగలగుతున్నారు.నేనూ తెలుసుకోవాలనుకుంటున్నాను అంటూ స్వాతితో పులిహోర క‌లిపేందుకు ప్ర‌య‌త్నాలు చేశాడు అఖిల్‌.

ఇంత‌లోనే స్వాతి కనురెప్ప వెంట్రుక కింద పడగా.దాన్ని అఖిల్ తీసి ఇచ్చాడు.

అయితే కనురెప్ప వెంట్రుకతో అఖిల్ మనసులో కోరిక తీరుతుందో లేదో టెస్ట్ చేసి చెప్పింది స్వాతి.

ఈ క్ర‌మంలోనే అఖిల్ మనసులో ఏం అనుకుంటే అది జరగాలి అనుకుంటూ స్వాతి.

క‌నురెప్ప వెంట్రుక‌ను చేతిపై పెట్టుకొని గట్టిగా ఊదగా.ఆ వెంట్రుక ఎగిరిపోయింది.

దీంతో నువ్వు కోరుకున్న‌ది ఖ‌చ్చితంగా అవుతుంద‌ని అఖిల్‌కు చెప్పింది స్వాతి.అయితే వీరిద్ద‌రు ముచ్చ‌ట్లు పెట్టుకోవ‌డం మోనాల్‌కు న‌చ్చ‌లేద‌ని చెప్పాలి.

ఏదేమైనా మొన్న‌టి వ‌ర‌కు మోనాల్ వెన‌క తిరిగిన అభిజిత్‌, అఖిల్‌లు.ఇప్పుడు స్వాతి వెంట ప‌డ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.

#Monal Gajjar #Bigg Boss #Boss 4 Telugu #Akhil #Abhijith

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Abhijith Akhil Impress Swathi Deekshith Bigg Boss Related Telugu News,Photos/Pics,Images..