అభి ఇమేజ్‌ మరింత పెరిగింది.. ఇక అతడే నూరు శాతం విజేత

తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్‌ 4 విజేతగా ఎవరు నిలుస్తారు అని మీరు అనుకుంటున్నారు అంటూ వంద మందిని అడిగితే అందులో 80 మంది ప్రస్తుతం అభిజిత్‌ గెలుస్తాడు.అభినే గెలవాలంటూ గట్టిగా అరిచి మరీ చెబుతున్నారు.ఆయన టాస్క్‌ లు ఏమీ ఆడడు.ఫిజికల్‌ గా ఆడని అతడు ఎలా విజేత అవ్వాలని మీరు అనుకుంటున్నారు అంటే బిగ్‌ బాస్‌ అంటే కేవలం ఫిజికల్‌ గా ఉంటే సరిపోదు.

 Abhijith Again Proved His Humanity In Task , Abhijith , Akhil, Akhil Bb4, Bb4, T-TeluguStop.com

బిగ్‌ బాస్‌ అనేది ఎమోషన్‌ ను కంట్రోల్‌ చేసుకోవాల్సిన షో.అభిజిత్‌ ఎప్పుడు కూడా ఏ విషయంలో కూడా అభిజిత్‌ అవ్వడం కాని.లో గా ఫీల్‌ అవ్వలేదు.అలాంటి అభిజిత్‌ విజేత అవ్వాల్సిందే అంటున్నారు.ప్రతి ఒక్కరికి తన సాయం కావాల్సిన సమయంలో అభిజిత్‌ అందించాడు.తాజా ఎపిసోడ్‌లో అఖిల్‌ మరియు సోహెల్‌ లకు పూర్తి సహాయ సహకారం అందించాడు.

వారిద్దరితో అభిజిత్‌ కు చాలా సార్లు గొడవలు అయ్యాయి.ముఖ్యంగా అఖిల్‌ తో అభిజిత్‌కు అయిన గొడవ మామూలుదిగా కాదు.ఇద్దరు కూడా కొట్టుకునే వరకు వెళ్లారు అనడంలో సందేహం లేదు.మొత్తానికి బిగ్‌ బాస్‌ లో అఖిల్‌ మరియు అభిజిత్‌ లు ఇద్దరు కూడా కొన్ని గంటలు కూడా కలిసి బాగున్నట్లుగా అనిపించలేదు.

అందుకే ఇద్దరు కూడా ఎప్పుడు కలిసి ఉన్నట్లుగా అనిపించదు.కాని అభిజిత్‌ మాత్రం తన సాయం తన సలహాలు సూచనలు వచ్చిన సమయంలో ఖచ్చితంగా అఖిల్‌ కు సాయంగా నిలిచాడు.

తాజాగా టాస్క్‌ లో భాగంగా అఖిల్‌ టాయిలెట్‌ కు వెళ్లాల్సి వచ్చిన సమయంలో కూడా అభిజిత్‌ సాయంగా నిలిచాడు.అభిజిత్‌ ఇచ్చిన సాయంతో ఇద్దరు కూడా అంత వరకు ఉన్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

అవినాష్‌ వారికి పూర్తి దూరంగా ఉంటూ వచ్చాడు.కేవలం అభిజిత్‌ మాత్రమే వారి అవసరాలు తీర్చుతూ వచ్చాడు.

అందుకే టాస్క్‌ పూర్తి అయ్యాక అభిజిత్‌ ను గట్టిగా హగ్‌ చేసుకుని మరీ ఏడ్చారు.ఈ ఎపిసోడ్‌ తో అభిజిత్‌ క్రేజ్‌ మరింత పెరగడం ఖాయం.

దాంతో అతడే ఇక నూరు శాతం విజేత అంటూ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube