బిగ్ బాస్ లో అతనే విలన్ అంటున్న అభిజిత్ తల్లి?  

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ షో రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులను అలరిస్తున్న సంగతి తెలిసిందే.గత సీజన్ల స్థాయిలో ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ అందించకపోయినా కరోనా విజృంభణ నేపథ్యంలో థియేటర్లు మూతబడటంతో ప్రేక్షకులు ఈ షో చూడటానికి ప్రాధాన్యతనిస్తున్నారు.

TeluguStop.com - Abhijeet Mother Akhil Villain Bigg Boss House

ఇప్పటికే 11 వారాలు పూర్తి చేసుకున్న ఈ షోలో ఈ వారం ఎలిమినేషన్ కు అవినాష్, మోనాల్ , అరియానా, అఖిల్ నామినేట్ అయ్యారు.
అయితే ఈ వారం అవినాష్ ను ఎలిమినేట్ చేసే అవకాశం ఉందని.

అయితే బిగ్ బాస్ ఎలిమినేట్ చేసినా ఎవిక్షన్ పాస్ సహాయంతో అవినాష్ ఒకసారి సేవ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.ఇకపోతే యాంకర్ రవి బిగ్ బాస్ షోలో అభిజిత్ ను విన్నర్ చేయాలని తన వంతు ప్రయత్నం చేస్తున్నాడు.

TeluguStop.com - బిగ్ బాస్ లో అతనే విలన్ అంటున్న అభిజిత్ తల్లి-General-Telugu-Telugu Tollywood Photo Image

అభిజిత్ కజిన్ కావడంతో పాటు వ్యక్తిగతంగా క్లోజ్ కావడంతో అభిజిత్ కు ఫేవర్ గా ఇంటర్వ్యూలు చేస్తూ అతనికి ఓటింగ్ వచ్చేలా రవి జాగ్రత్త పడుతున్నాడు.

గతంలో వర్షిణి సిస్టర్స్ తో అభిజిత్ గురించి పాజిటివ్ గా చెప్పించిన రవి తాజాగా అభిజిత్ తల్లి, హారిక తల్లిని ఇంటర్వ్యూ చేశారు.ఈ ఇంటర్వ్యూలో భాగంగా బిగ్ బాస్ హౌస్ లో విలన్ ఎవరు అని ప్రశ్నించగా అభిజిత్ తల్లి లక్ష్మీ అమ్మ రాజశేఖర్ మరియు అఖిల్ విలన్ అని చెప్పారు.అమ్మ రాజశేఖర్ ఇప్పటికే ఎలిమినేట్ కాగా ప్రస్తుతం అఖిల్ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నారు.

అభిజిత్ తల్లి చేసిన కామెంట్లు అఖిల్ పై ప్రేక్షకుల్లో నెగిటివిటీ పెంచే అవకాశం ఉంది.

అభిజిత్ తల్లి, కొన్నిసార్లు ప్రోమోలలో అభిజిత్ కోప్పడటంతో ప్రేక్షకుల్లో నెగిటివిటీ వస్తుందని భయం వేసిందని కానీ ఆ తరువాత ఎపిసోడ్ చూశాక ఓపిక నశించి అభిజిత్ ఆ విధంగా అన్నాడని తమకు అర్థమైందని చెప్పారు.మరోవైపు అభిజిత్ విన్నర్ అంటూ ప్రచారం జరుగుతున్నా అభిజిత్ కు సొహెల్ రూపంలో గట్టి పోటీ ఎదురవుతూ ఉండటం గమనార్హం.

#Akhil Villain #Akhil Behavior #Negativity #BiggBoss #AbhijeetMother

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Abhijeet Mother Akhil Villain Bigg Boss House Related Telugu News,Photos/Pics,Images..