తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ నాల్గువ సీజన్లో ఎనిమిదో వారం జరుగుతున్న సంగతి తెలిసిందే.కొత్త కొత్త టాస్క్‌లు, లవ్ ట్రాకులు, గొడవలు రోజురోజుకు బిగ్ బాస్ హౌస్‌ను హీటెక్కిస్తున్నాయి.
ముఖ్యంగా నామినేషన్స్ వచ్చాయంటే.ఇంటి సభ్యుల మధ్య వాడి వేడిగా మాటల యుద్ధం జరిగుతోంది.
ఇదిలా ఉంటే.గత కొన్ని రోజులుగా అభిజిత్, మోనాల్‌కి దూరంగా ఉంటూ వస్తోన్న విషయం తెలిసిందే.
టాస్క్‌లో మినహా.ఇతర సమయంలో మోనాల్ వైపే చూడడం మానేశాడు అభిజిత్.
వీరిద్దరి మధ్య మాటలు కుదుర్చిందేకు ఇంటి సభ్యులు నానా రకాలుగా ప్రయత్నించినప్పటికీ.అభిజిత్ మాత్రం మోనాల్‌తో మాట్లాడేందుకు ఇష్టపడడం లేదు.అఖిల్ సైతం చెప్పి చూశారు.కానీ, అభిజిత్ మనసు మాత్రం మార్చుకోలేదు.
అయితే ఇదే సమయంలో మోనాల్ గురించి తన బ్యాబ్ మెంబర్స్ అయిన నోయల్, హారిక, లాస్యల వద్ద చెబుతూ.ఆమె క్యారెక్టర్‌ను బ్యాడ్ చేస్తున్నారు.
ఇక నిన్న కూడా మోనాల్ విషయంలో నోరు జారి.బాడీ షేమింగ్ చేశాడు.నిన్నటి ఎపిసోడ్లో.మోనాల్ నడుస్తూ వెళ్తుంటే అభిజిత్ హేళనగా నవ్వుతూ పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ ఒంటెలా నడుస్తుందని.
ఆమెను చూస్తే మంచి మజా వస్తుంది.నువ్ కూడా అబ్జర్వ్ చేయి అంటూ నోయల్‌తో అన్నాడు. దీంతో నోయల్.ఆమెను ఎంత బాగా అబ్జర్వ్ చేస్తున్నావో అంటూ అభిజిత్‌కు సెటైర్ వేశాడు.మొత్తానికి మోనాల్ విషయంలో అభిజిత్ పదే పదే నోరు జారడం.అతడిపై నెగిటివిటీ పెంచేస్తుంది.
మరోవైపు మోనాల్ అభిమానులు.అభిజిత్‌పై ఫైర్ అవుతూ నానా రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
కాగా, ఈ వారం అఖిల్, మోనాల్, లాస్య, అమ్మ రాజశేఖర్, మెహబాబ్, అరియానాలు నామినేట్ కాగా.వారిలో ఒకరు ఎలిమినేట్ అవ్వనున్నారు.