తెలుగు అతి పెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ నాల్గువ సీజన్.ఆరు వారాలు పూర్తి చేసుకుని ఏడో వారినికి చేరుకున్న సంగతి తెలిసిందే.ఏడో వారం నామినేషన్ ప్రక్రియ కూడా రంజుగా సాగింది.అయితే ఈ సారి వేరే వాళ్లను నామినేట్ చేయడం కాకుండా.సెల్ఫ నామినేట్ అవ్వాలని బిగ్ బాస్ ఫిటింగ్ పెట్టారు.దీంతో ఈ వారం హాట్ హాట్‌గా సాగిన చర్చల అనంతరం.
అభిజిత్, మోనాల్, అరియానా, దివి, నోయల్, అవినాష్ నామినేట్ అయ్యారు.నామినేషన్స్ విషయం పక్కన పెడితే.
గత వారం రోజులుగా మోనాల్, అభిజిత్ మధ్య మాటలు లేవన్న సంగతి తెలిసిందే. మోనాల్ బిహేవియర్ నచ్చకపోవడంతో.
అభిజిత్ ఆమెతో మాట్లాడడం మానేశాడు.అయితే వీరిద్దరిని కలిపేందుకు అరియానా రంగంలోకి దిగింది.
ఈ క్రమంలోనే ‘నిజంగా చెప్పాలంటే క్షమించు’ అని పాట పాడుతూ కాసేపు ఓవరాక్షన్ చేసిన అరియానా.అనంతరం అభిజిత్ నీతో ఒక విషయం చెప్పాలని కోరింది.
ఏంటా విషయం అని అభిజిత్ అడగ్గా.`జరిగిందేదో జరిగింది.
ఇప్పటికైనా మోనాల్‌తో మాట్లాడొచ్చు కదా` అని రిక్వెస్ట్ చేసింది.
దీంతో అభిజిత్ మాట్లాడుతూ.
ఆ విషయంపై నువ్వు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది.ఆమెతో మాట్లాడే ప్రసక్తే లేదు.
వదిలేయ్ అంటూ దిమ్మతిరిగే సమాధానం ఇచ్చాడు.అయితే అరియానాను వదిలేయమన్నాడు కానీ, అభిజిత్ మాత్రం ఆ విషయాన్ని వదలకుండా.
హారిక, నోయల్, లాస్యలతో చర్చించించి రచ్చ రచ్చ చేశాడు.
`మోనాల్‌తో మాట్లాడటం నాకు ఇష్టం లేదని.
అయినా అరియానాకు ఎందుకంత దూ**.` అంటూ ఓ ఇబ్బందికర పదం వాడి అభిజిత్ నోరు జారాడు.
ఇక అభిజిత్ మాటలకు లాస్య, అభిజిత్ నవ్వుకున్నారు.అయితే ఏదో చనువుతో అరియానా చెబితే.
అభిజిత్ దాన్ని తీసుకెళ్లి అందరితో చర్చించి, ఆమెపై బ్యాడ్ కామెంట్స్ చేయడంపై ప్రేక్షకులు మండిపడుతున్నారు.ఏదేమైనా ఈ విషయంపై అభిజిత్‌కు వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జున చేత క్లాస్ తప్పదని తెలుస్తోంది.