పెళ్లి ఎప్పుడో లైవ్ లో చెప్పేసిన బిగ్ బాస్ విన్నర్ అభిజిత్!

బిగ్ బాస్ సీజన్ 4 టైటిల్ విన్నర్ గా నిలిచిన సినీ నటుడు అభిజిత్.బిగ్ బాస్ ముందు అంతగా గుర్తింపు లేకపోయినా.

 Abhijeet About His Marriage And Movie Updates-TeluguStop.com

బిగ్ బాస్ తర్వాత మాత్రం మంచి ఫాలోయింగ్ అందుకున్నాడు అభిజిత్.కానీ బిగ్ బాస్ తర్వాత ఇప్పటివరకు ఏ ప్రాజెక్టు లో కానీ అడుగు పెట్టలేదు.

అంతేకాకుండా ఇతర రంగాలలో కూడా దృష్టి పెట్టలేదని అర్థమవుతుంది.

 Abhijeet About His Marriage And Movie Updates-పెళ్లి ఎప్పుడో లైవ్ లో చెప్పేసిన బిగ్ బాస్ విన్నర్ అభిజిత్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com


ఇక ప్రస్తుతం ఉన్న కరోనా వైరస్ ప్రభావం వల్ల చాలామంది సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా ప్రజలకు వైరస్ గురించి సలహాలు ఇస్తున్నారు.

ఇక తాజాగా బిగ్ బాస్ విన్నర్ అభిజిత్ లైన్ లోకి వచ్చాడు.ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితి గురించి అభిమానులతో పంచుకున్నాడు.రోజుకి ఇన్ని కేసులు వస్తున్నాయంటే బాధగా ఉందని, ప్రపంచంలో మన దేశము దారుణమైన స్థానంలో ఉందని తెలిపారు.ఈ సమయంలో బయటకు వెళ్ల కూడదని, ఎవరి ప్రాణాలు వాళ్ళు కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని పంచుకున్నాడు.


ఇక అభిమానులతో కాసేపు ముచ్చటిస్తూ.ప్రస్తుతం బాధ్యతగా డాక్టర్లు, వైద్య సిబ్బందులు, పారిశుద్ధ్య కార్మికులకు ధన్యవాదాలు తెలిపాడు.ఇక తనకు తెలిసిన డాక్టర్ ఫ్రెండు ఉన్నాడని‌‌.ప్రస్తుతం పరిస్థితుల్లో ఎప్పుడు వెళ్తున్నాడు, ఎప్పుడు వస్తున్నాడు కూడా తెలియట్లేదు అని చెప్పుకొచ్చాడు.ఇక సినిమా గురించి కొందరు అభిమానులు ప్రశ్నించగా దీని గురించి ఎటువంటి ప్రకటన చేయలేదు‌.కానీ ప్రస్తుతం తాను స్పానిష్ నేర్చుకుంటున్నాను అని తెలిపాడు.

ఇక పెళ్లి గురించి పెళ్లి ఎప్పుడు అని ప్రశ్నించగా.అభిజిత్ నవ్వుతూ ఇప్పుడప్పుడే ఉండదులే అంటూ కూల్ సమాధానమిచ్చాడు‌.

ఇక గతంలో ఈయన మూడు ప్రాజెక్టులలో అవకాశాలు వచ్చాయని తెలపగా ఇప్పటివరకు ఆ విషయం గురించి మళ్లీ ఎవరు ప్రకటించలేదు.

#BiggBoss #BiggBoss #Live Chat #Bigg Boss #Marrige

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు