నీ ఎదుగుదల ఎవరో పెట్టిన బిక్ష కాదు.. అనసూయ పై అభి ఇంట్రెస్టింగ్ కామెంట్స్?

బుల్లితెర యాంకర్ గా, బుల్లితెరపై మకుటంలేని మహారానిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న యాంకర్ అనసూయ గురించి అందరికీ సుపరిచితమే.కెరియర్ మొదట్లో ఈమె న్యూస్ రిప్రజెంటేటర్ గా పనిచేశారు.

 Abhi Interesting Comments On Anchor Anasuya Abhi, Tollywood, Anchor Anasuya, Jabardasth, Pushpa, Rangasthalam, Ram Charan-TeluguStop.com

అనంతరం యాంకర్ గా పలు కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించిన జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది.ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన పాపులారిటీతో వెండితెర అవకాశాలను కూడా అందుకుంది.

ఈ విధంగా రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్ర ద్వారా అనసూయ విపరీతమైన పాపులారిటీ సంపాదించుకుంది.

 Abhi Interesting Comments On Anchor Anasuya Abhi, Tollywood, Anchor Anasuya, Jabardasth, Pushpa, Rangasthalam, Ram Charan-నీ ఎదుగుదల ఎవరో పెట్టిన బిక్ష కాదు.. అనసూయ పై అభి ఇంట్రెస్టింగ్ కామెంట్స్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ పాత్ర ద్వారా ఈమెకు మరిన్ని అవకాశాలు వచ్చాయి.

ఈ క్రమంలోనే ప్రస్తుతం వెండితెరపై అరడజనుకు పైగా సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్న అనసూయ గురించి మరొక కమెడియన్ అదిరే అభి షాకింగ్ కామెంట్స్ చేశారు.ఓ బుల్లితెర కార్యక్రమంలో పాల్గొన్న అదిరే అభి అనసూయ గురించి ఈ వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

ఇక ఈ వీడియోని అనసూయ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అనసూయ అభిమానులు సైతం ఈ వీడియో చూసి తనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

అదిరే అభి అనసూయ ముద్దుగా అను అని పిలుస్తారు.ఈ సందర్భంగా అభి మాట్లాడుతూ అను నేను నిన్ను కెరియర్ బిగినింగ్ నుంచి చూస్తున్నాను.కెరియర్ మొదట్లో న్యూస్ రీడర్ గా చేశావు.

అనంతరం యాంకర్ గా చేశావు, ప్రస్తుతం పెద్ద పెద్ద సెలబ్రిటీల సినిమాలలో నటిస్తున్నావు.ఇలా నీ ఎదుగుదల నీకు ఎవరో పెట్టిన బిక్ష కాదు.

నీకు నువ్వుగా కష్టపడి సంపాదించుకున్నది అంటూ అనసూయ ఎదుగుదల గురించి అభి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube