కలాం బయోపిక్ తీసే అర్హత తమదే అంటున్న నిర్మాతలు

మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం జీవిత కథతో అలీ టైటిల్ రోల్ పోషిస్తూ హాలీవుడ్ నిర్మాణ సంస్థ కలాం అనే టైటిల్ తో రాజేష్ దానేటి దర్శకత్వంలో సినిమా తెరకేక్కిస్తుంది.ఈ సినిమాకి సంబందించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా కేంద్ర మంత్రి చేతుల మీదుగా రిలీజ్ చేశారు.

 Abdul Kalam Biopic Raise The Controversy-TeluguStop.com

అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి వివాదం రాజుకుంది.అబ్దుల్ కలాం జీవిత కథని తెరకెక్కించే హక్కు తమకి మాత్రమే ఉందని, బయోపిక్ రైట్స్ తమ వద్ద ఉన్నాయని ప్రముఖ నిర్మాత అభిషేక్ అగర్వాల్ ఒక ప్రకటన చేశారు.

డాక్టర్ కలాం జీవితంపై ఏ భాషలోనైనా సినిమా, డాక్యుమెంటరీని నిర్మించే, పోస్టర్లను రిలీజ్ చేసే అధికారిక హక్కులను తాము కలిగివున్నామని ఆయన స్పష్టం చేశారు.డాక్టర్ కలాంకు సంబంధించి ఏ రూపంలోనైనా సినిమాలు తీసే ప్రయత్నం ఎవరైనా చేస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.ఈ సందర్భంగా ‘డాక్టర్ అబ్దుల్ కలాం’ టైటిల్‌తో తాము నిర్మించబోయే మూవీ పోస్టర్‌ను అభిషేక్ అగర్వాల్ విడుదల చేశారు.‘ఎవ్విరి స్టోరీ హ్యాజ్ ఎ హీరో’ అనే ఉప శీర్షికతో డ్రీమ్ మర్చంట్స్, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై రామబ్రహ్మం సుంకర, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి.అయితే ఇప్పటికే కలాం టైటిల్ తో అలీ లీడ్ రోల్ లో సినిమా తెరకెక్కుతున్న నేపధ్యంలో వీళ్ళు ఈ రకమైన ప్రకటన చేసినట్లు తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube