డ్రగ్స్ సరఫరా చేస్తూ పట్టుబడ్డ ఏబీసీడీ సినిమా యాక్టర్  

ABCD fame Kishore Shetty arrested in Drugs Case, Bollywood, Kannada Cinema Industry, Bangalore, Mangalore, ABCD Movie - Telugu Abcd Fame Kishore Shetty Arrested In Drugs Case, Abcd Movie, Bangalore, Bollywood, Kannada Cinema Industry, Mangalore

కన్నడ ఇండస్ట్రీ ప్రస్తుతం డ్రగ్స్ కేసుల కలకలం నడుస్తుంది.ఇప్పటికే డ్రగ్స్ సప్లయర్స్ తో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో ఇద్దరు కన్నడ హీరోయిన్స్ ని అక్కడ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

TeluguStop.com - Abcd Fame Kishore Shetty Arrested In Drugs Case

వారి ద్వారా మరిన్ని విషయాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు.ఇంతకాలం కబుర్లు చెప్పిన వాళ్ళు ఇప్పుడు డ్రగ్స్ ఉచ్చులో చిక్కుకొని విలవిలలాడిపోతున్నారు.

ఓ పక్క బెంగుళూరులో ఈ వ్యవహారం నడుస్తూ ఉండగానే ఓ నటుడు డ్రగ్స్ విక్రయాలకి పట్టుబడ్డాడు.ఇప్పుడు ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

TeluguStop.com - డ్రగ్స్ సరఫరా చేస్తూ పట్టుబడ్డ ఏబీసీడీ సినిమా యాక్టర్-General-Telugu-Telugu Tollywood Photo Image

అరెస్ట్ చేసిన నటుడు హిందీ ఏబీసీడీ సినిమాలో కీలక పాత్రలో నటించిన కొరియోగ్రాఫర్ కిషోర్ అమన్ శెట్టి మంగళూరు సిటీ పోలీస్ కమిషనర్ వికాశ్ కుమార్ తెలిపారు.

అమన్ శెట్టితో పాటు అఖిల్ నౌషీల్ మాదకద్రవ్యమైన ఎండీఎంఏను విక్రయించేందుకు ప్రయత్నిస్తూ పట్టుబడ్డారని తెలిపారు.

వీరిద్దరూ కలిసి డ్రగ్స్ సంపాదించిన తరువాత, బైక్ పై వెళుతూ పట్టుబడ్డారని తెలిపారు.వీరికి డ్రగ్స్ ముంబై నుంచి వచ్చాయని గుర్తించామని, తదుపరి దర్యాఫ్తు కొనసాగుతోందని అన్నారు.

నిందితుల నుంచి లక్ష రూపాయల విలువ చేసే డ్రగ్స్ తో పాటు మోటార్ సైకిల్, రెండు మొబైల్ ఫోన్లను సీజ్ చేశామని, ఎన్డీపీఎస్ చట్టం కింద వీరిపై కేసును రిజిస్టర్ చేశామని తెలిపారు. ఓ వైపు బాలీవుడ్, ఇటు శాండిల్ వుడ్ లో డ్రగ్స్ భాగోతం సంచలనంగా మారి పెద్ద పెద్ద తలకాయలు అన్ని బయటకి వస్తూ ఉండగా, ఇదే సమయంలో డ్రగ్స్ సప్లై చేసే ప్రయత్నం చేస్తూ అమన్ శెట్టి దొరికిపోవడం సంచలనంగా మారింది.

అమన్ శెట్టి డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ కార్యక్రమంతో పాప్యులర్ అయి, ఆపై బాలీవుడ్ సినిమా ఏబీసీడీ చిత్రంలోనూ నటించాడు.పలు కన్నడ సినిమాలలో కూడా అమన్ శెట్టి నటించాడు.

#Mangalore #ABCDFame #Bangalore #KannadaCinema

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Abcd Fame Kishore Shetty Arrested In Drugs Case Related Telugu News,Photos/Pics,Images..