నోటికి పని చెబుతున్న విజయసాయి రెడ్డి! పరువునష్టంకి సిద్ధమైన వెంకటేశ్వరరావు  

Ab Venkateswara Rao To File Defamation Suit Against Vijaya Sai Reddy -

వైసీపీ నేత విజయసాయి రెడ్డి ఎన్నికల తర్వాత కూడా తమ మాటల దాడిలో ఎ మాత్రం మార్పు లేకుండా అదే పనిగా అందరి మీద బురదజల్లే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు.టీడీపీ ప్రభుత్వంలో పని చేసిన అధికారులని లక్ష్యంగా చేసుకొని మాటల దాడి చేయడం ఆపడం లేదు.

Ab Venkateswara Rao To File Defamation Suit Against Vijaya Sai Reddy

ఎన్నికల ముందు మాటిమాటికి ఎలక్షన్ కమిషన్ కి లెటర్ రాసి ఏపీలో పోలీస్ అధికారులపై యాక్షన్ తీసుకోవాలని కోరిన విజయసాయి రెడ్డి మళ్ళీ ఏపీ పోలీసులపై తన నోటి దురుడు చూపించారు.ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సంస్థ ఈ-ప్రగతితో ఏపీ మాజీ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులకు సంబంధాలున్నాయని విజయసాయి సోమవారం ఢిల్లీలో ఆరోపించారు.

అయితే ఎలాంటి ఆధారాలు లేకుండా తనపైన తన కుటుంబంపై ఆరోపణలు చేసినందుకు ఇప్పుడు వెంకటేశ్వరరావు విజయసాయి రెడ్డిపై పరువునష్టం దావా వేసారు.ఎన్నికల ముందు శ్రీకాకుళం ఎస్పీ కూడా విజయసాయి రెడ్డి తనపై చేసిన ఆరోపణలపై పరువునష్టం దావా వేసారు.

ఇలా పోలీస్ అధికారులని కెలికి మరి విజయసాయి రెడ్డి ఇరుక్కోవడం జగన్ కి ఇబ్బందికరంగా మారుతుంది అనే టాక్ రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Ab Venkateswara Rao To File Defamation Suit Against Vijaya Sai Reddy- Related....