ధోని ఇక తప్పుకోవడం బెటర్ అన్న వారికి స్ట్రాంగ్ కౌంటర్..! 80 ఏళ్ళు వచ్చి వీల్ చైర్ పై ఉన్నా టీం లో ఆడిస్తా.!     2018-10-23   10:10:05  IST  Sai Mallula

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్‌, వికెట్ కీప‌ర్ బ్యాట్స్‌మెన్ మ‌హేంద్ర సింగ్ ధోనీ.. ధోనీ పేరు విన‌గానే మ‌న‌కు అత‌ని కూల్ యాటిట్యూడ్‌, మైదానంలో అత‌ని ప్ర‌వ‌ర్త‌న‌, జ‌ట్టు ఆట‌గాళ్ల‌కు ఉత్సాహాన్ని అందించే మాట‌లు, త‌న‌దైన శైలిలో విరుచుకు ప‌డే హెలికాప్ట‌ర్ షాట్లు మ‌న‌కు గుర్తుకు వ‌స్తాయి. భార‌త జ‌ట్టుకు రెండు వ‌ర‌ల్డ్ క‌ప్ ల‌ను అందించ‌డ‌మే గాక టీమిండియాకు ఎన్నో మ‌రుపురాని విజ‌యాల‌ను అందించాడు. అనేక ఉత్కంఠ మ్యాచుల్లో జట్టును ఒంటి చేత్తో న‌డిపించి విజ‌య తీరాల‌కు చేర్చిన క్ష‌ణాలు మ‌న‌కు క‌ళ్ల ముందు మెదులుతాయి.

AB De Villiers About MS Dhoni Retirement-

AB De Villiers About MS Dhoni Retirement

గత ఏడాది జనవరిలో వన్డే, టీ20 కెప్టెన్సీ నుంచి ధోనీ వైదొలడంతో అతని స్థానంలో జట్టు పగ్గాలని విరాట్ కోహ్లీ అందుకున్నాడు. అప్పటి నుంచి ఒకవేళ విరాట్ కోహ్లీకి విశ్రాంతినిస్తే అతనికి బదులుగా టెస్టుల్లో రహానె.. వన్డే, టీ20ల్లో రోహిత్ శర్మ కెప్టెన్‌గా ఉంటూ వస్తున్నారు.

అయితే కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాక ధోనీ వేగం తగ్గింది. పరుగులు సాధించడంలో, భారీ ఇన్నింగ్స్ నెలకొల్పడంలో విఫలం అవుతున్నాడు. దీంతో ధోని పై అనేక విమర్శలు వినిపిస్తున్నాయి. ధోని ఇక క్రికెట్ నుండి తప్పుకోవడం బెటర్ అని చాలామంది అభిప్రాయ పడుతున్నారు. అయితే ధోనీ రిటైర్ మెంట్ పై వస్తున్న వార్తలపై దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు డివిలియర్స్ స్పందించాడు.

AB De Villiers About MS Dhoni Retirement-

ధోనీ లాంటి అద్భుతమైన ఆటగాన్ని తప్పించాలనుకునేవారు ఓ సారి అతడి రికార్డులను చూడాలని డివిలియర్స్ సూచించారు. అతడిని జట్టు నుండి తప్పించాలని తాను ఎప్పుడూ కోరుకోనని అన్నారు. అంతేకాదు ధోనీ 80ఏళ్ల వయసులో వున్నా తన ఆల్ టైమ్ ఎలెవన్స్ డ్రీం టీంలో స్థానం కల్పిస్తానని అన్నారు. ధోని వీల్ చైర్ పై వచ్చి బ్యాటింగ్ చేసినా అధ్భుతాలు సృష్టించగలడనే నమ్మకం తనకుందని డివిలియర్స్ వెల్లడించారు.