'ఆవిరి'మూవీ స్టోరీ రివ్యూ అండ్ రేటింగ్

విభిన్న చిత్రాల దర్శకుడిగా పేరున్న దర్శకుడు రవిబాబు ‘అదుగో’ అంటూ పంది పిల్లతో ఒక సినిమాను చేశాడు.ఆ సినిమా రవిబాబు పరువు తీయడంతో పాటు మంచి పేరును కూడా పోగొట్టింది.

 Aaviri Movie Story Review And Rating-TeluguStop.com

రెండు సంవత్సరాలు కష్టపడి అదుగోను తీస్తే ప్రేక్షకులు తిరష్కరించారు.దాంతో మళ్లీ రవిబాబు తనకు సెక్సెస్‌ తెచ్చి పెట్టిన హర్రర్‌ జోనర్‌ను ఎంపిక చేసుకున్నాడు.

ఈ సినిమా ట్రైలర్‌ మరియు ప్రమోషనల్‌ వీడియోలు ఆసక్తిగా ఉన్నాయి.మరి సినిమా ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం.

కథ :


Telugu Aaviri, Aaviristory, Ravi Babu, Tollywood Box-

సంతోషంగా గడుపుతున్న ఒక కుటుంబంలో దెయ్యం రేపిన అలజడి నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది.ఆవిరి రూపంలో ఉండే ఆ దెయ్యం ఆ కుటుంబానికి చెందిన చిన్న పాప మునిని లోబర్చుకుంటుంది.ఆ దెయ్యం చెప్పినట్లుగా ముని వింటూ ఇంట్లోంచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది.ఎన్ని సార్లు ఆపినా ఎంతగా ప్రయత్నించినా కూడా ముని దెయ్యంను బయటకు తీసుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తూనే ఉంటుంది.అసలు ఆ దెయ్యం ఎవరు? మునిని బయటకు ఎందుకు తీసుకు వెళ్లాలనుకుంది, చివరకు ఏమైంది అనేది సినిమా చూసి తెలుసుకోండి.

నటీనటుల నటన :


రవిబాబు మరోసారి విలక్షణమైన నటనతో ఆకట్టుకున్నాడు.కూతురు ఆపదలో ఉన్న తండ్రి పాత్రలో రవిబాబు మంచి నటన కనబర్చాడు.కొన్ని సీన్స్‌లో అతడి నటన పీక్స్‌లో ఉంది.నేహా చౌహాన్‌ నటన కూడా పర్వాలేదు.హర్రర్‌ సీన్స్‌లో ఆమె భయపడుతూ భయపెట్టడంలో సఫలం అయ్యింది.

భరణి శంకర్‌ నటన చాలా బాగుంది.ఆయన బాడీ లాంగ్వేజ్‌ కూడా ఆకట్టుకుంది.

పాప నటన చాలా బాగుంది.ఆమె సినిమాకు ప్రధాన ఆకర్షణ.

టెక్నికల్‌ :

దర్శకుడు రవిబాబు ఎప్పటిలాగే చాలా విభిన్నమైన స్టోరీలైన్‌తో స్క్రీన్‌ప్లేతో మెప్పించాడు.భయపెట్టే స్క్రీన్‌ప్లేతో దర్శకుడు రవిబాబు చేసిన ఈ చిత్రం హర్రర్‌ సినిమాలను ఇష్టపడే వారిని కట్టి పడేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కూడా చాలా బాగుంది.ముఖ్యంగా పలు సీన్స్‌లో బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ ఆకట్టుకునే విధంగా సాగింది.ఎడిటింగ్‌లో కొన్ని లోపాలున్నాయి.సినిమాటోగ్రఫీ బాగుంది.భయపెట్టేడంలో సక్సెస్‌ అయ్యింద.ఇ

విశ్లేషణ :


రవిబాబు అదుగో సినిమాతో నిరుత్సాహ పర్చాడు.కనుక మొదట ఆవిరి సినిమాను అసలు ఎవరు పట్టించుకోలేదు.కాని ఎప్పుడైతే ఆవిరి సినిమాను తాను వరంగల్‌ మాజీ కలెక్టర్‌ అమ్రాపాలి జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా రూపొందించాను అంటూ చెప్పాడో అప్పుడే సినిమా పై అంచనాలు పీక్స్‌కు వెళ్లాయి.

సినిమాపై పెరిగిన అంచనాలను నిలబెట్టుకుందని చెప్పాలి.హర్రర్‌ సీన్స్‌తో అలరించాడు.రవిబాబు హర్రర్‌ సినిమాలు చేయడంలో మంచి అనుభవం ఉన్న వ్యక్తి కనుక అనుకున్నట్లుగానే హర్రర్‌ ప్రేక్షకులను అలరించాడు.ఇలాంటి సినిమాలను ఇష్టపడే కొందరు ఆవిరి ఎంజాయ్‌ చేస్తారు.ఇతరులు మాత్రం దీనికి దూరంగా ఉండటం బెటర్‌.

ప్లస్‌ పాయింట్స్‌ :


హర్రర్‌ సీన్స్‌,
బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌,
కాన్సెప్ట్‌

మైనస్‌ పాయింట్స్‌ :


కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ లేకపోవడం,
ఎడిటింగ్‌,
డైరెక్షన్‌

బోటమ్‌ లైన్‌ :


హర్రర్‌ నచ్చే వారికి ఆవిరి నచ్చుతుంది

రేటింగ్‌ : 2.5/5.0


.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube