బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ గురించి మనందరికీ తెలిసిందే.నటుడు బాబీ డియోల్ తాజాగా నటించిన వెబ్ సిరీస్ ఆశ్రమ్ 3.
ఈ సినిమా క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన విషయం తెలిసిందే.ఇందులో బాబీ డియోల్ సరసన ఇషా గుప్తా హీరోయిన్ గా నటించింది.
ఈ వెబ్ సిరీస్ కు ప్రకాష్ జా దర్శకత్వం వహించారు.ప్రస్తుతం ఎంఎక్స్ ప్లేయర్ లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది.
ఇది ఇలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
ఇంటర్వ్యూలోభాగంగా నటుడు బాబీ డియోల్ ఈ సీరీస్ లోని కొన్ని అభ్యంతరకర సన్నివేశాలు గురించి స్పందించారు.
అయితే మొదటి సారి అభ్యంతకర సన్నివేశంలో నటించడం కావడంతో తనకు భయం వేసింది అని, ఇలా మరీ సన్నిహితంగా కలిసి నటించడం తనకు ఇదే తొలిసారి అని చెప్పుకొచ్చాడు బాబీ డియోల్.కానీ ఇషా చాలా ప్రొఫెషనల్.
ఆమె పాత్రలో లీనమై పోవడంతో నాకు ఆమెతో రొమాంటిక్ సన్నివేశాల్లో నటించడం కొంత ఈజీ అయింది అని చెప్పుకొచ్చారు బాబీ డియోల్.
అది స్క్రీన్ పై కూడా సరిగానే వచ్చిందని ఒక ప్రతికూల పాత్రలో జనాలు నన్ను అంగీకరించినందుకు సంతోషంగా ఉంది అని తెలిపారు.అలాగే ఇకముందు కూడా డిఫరెంట్ అండ్ ఛాలెంజింగ్ రోల్స్ లో చేయగలను అనే నమ్మకం వచ్చింది అని తెలిపారు బాబీ డియోల్.