ఆ బిగ్ బాస్ బ్యూటీపై చిన్న వయసులోనే అత్యాచారం  

Aarti Singh Reveals About Physical Harassment - Telugu Aarti Singh Reveals, Big Boss, Bollywood, Physical Harassment

ఈ మధ్య కాలంలో ఆడవాళ్ళపై అత్యాచారాలు ఎంత ఎక్కువగా జరుగుతున్నాయో అందరికి తెలిసిందే.అభంశుభం తెలియని చిన్నారుల మీద కూడా కామందులు కన్ను వేసి కిరాతకంగా అత్యాచారాలు చేసి చంపేస్తున్నారు.

Aarti Singh Reveals About Physical Harassment

ఇలాంటి అత్యాచార ఘటనలలో ఎంత కఠిన చట్టాలు వేసిన జరగాల్సినవి మాత్రం జరుగుతూనే ఉంటాయి.ఈ ఘటనల నేపధ్యంలో చాలా మంది సెలబ్రిటీలు వారి మీద చిన్న వయసులో జరిగిన లైంగిక వేధింపులు, అత్యాచారాల గురించి సమాజం ముందు ఓపెన్ అవుతున్నారు.

హాలీవుడ్ సెలబ్రిటీలు చాలా మంది తమపై జరిగిన లైంగిక వేధింపులని మీడియాతో పంచుకున్నారు.ఇదిలా ఉంటే తాజా హిందీ బిగ్ బాస్ కంటిస్టెంట్ ఆర్తీ సింగ్ తన జీవితంలో ఎదురైనా లైంగిక వేధింపుల గురించి చపాక్ టీంతో పంచుకుంది.

13 ఏళ్ల వయసులో తనకు ఎదురైన ఈ దారుణ అనుభవం గురించి వెల్లడించారు.నేను ఇంట్లో ఒంటరిగా నిద్రపోతున్నాను.

ఆ టైంలో ఇంట్లోని పనివాడు నాపై అత్యాచారం చేయబోయాడు.నన్ను లొంగదీసుకునే ప్రయత్నం చేశాడు.

నేను మాత్రం అతడిని తీవ్రంగా ప్రతిఘటించాను.అతడి బట్టలు చించి, పెద్దగా అరిచి అక్కడి నుంచి తప్పించుకున్నాను.

రెండో అంతస్థు నుంచి దూకి బయటపడ్డాను.ఆ సమయంలోనే నాలో ఎంత శక్తి దాగుందో తెలిసింది.

ఆ తరువాత కొన్నేళ్ళ పాటు ఆ ఘటన నుంచి బయటపడలేకపోయా.అమ్మా, సోదరుడు ఇచ్చిన మానసిక స్థైర్యంతో నేను ఆ స్థితి నుంచి కోలుకున్నాను.

గత 7-8 సంవత్సరాలుగా నేను ప్రశాంతంగా ఉన్నాను.ఇప్పుడు కూడా ఈ విషయం మీతో పంచుకుంటుంటే నాకు చేతులు వణుకుతున్నాయి.

ఈ విషయాన్ని సదరు నటి చెప్పడంతో ఒక్కసారిగా బిగ్ బాస్ ఇంట్లో విషాద వాతావరణం నిండిపోయింది.

.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Aarti Singh Reveals About Physical Harassment Related Telugu News,Photos/Pics,Images..

footer-test