తెరపైకి ఆర్తి అగర్వాల్ బయోపిక్  

Aarthi Agarwal Biopic in Tollywood, Telugu Cinema, Celebrities Lifestyle, Biopic Trend - Telugu Aarthi Agarwal Biopic In Tollywood, Arthi Agarwal, Biopic, Biopic Trend, Celebrities Lifestyle, Karanam Malleswari, Mahanati, Telugu Cinema, Yatra

ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ప్రస్తుతం బయోపిక్స్ ట్రెండ్ నడుస్తుంది.వివిధ రంగాలలో ప్రముఖులగా ఉన్నవారి జీవిత కథలని తెరపై ఆవిష్కరిస్తూ నిర్మాతలు భాగానే డబ్బులు చేసుకుంటున్నారు.

TeluguStop.com - Aarthi Agarwal Biopic Yatra Mahanati Karunam Malleswari

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

ఇప్పటికే క్రీడా ప్రముఖుల జీవితాలని చాలా వరకు తెరపై ఆవిష్కరించేసారు.తెలుగులో వెయిట్ లిఫ్టర్ కరణం మల్లీశ్వరి బయోపిక్ త్వరలో పట్టాలు ఎక్కబోతుంది.

TeluguStop.com - తెరపైకి ఆర్తి అగర్వాల్ బయోపిక్-Movie-Telugu Tollywood Photo Image

పాన్ ఇండియా రేంజ్ లోని ఈ సినిమాని ఆవిష్కరించబోతున్నారు.ఇక సినిమాలో టైటిల్ రోల్ కోసం బాలీవుడ్ భామని సంప్రదిస్తున్నట్లు తెలుస్తుంది.

ఇదిలా ఉంటే తెలుగులో మహానటి, యాత్ర స్థాయిలో ఇప్పటి వరకు ఏ ఇతర బయోపిక్ కథలు అలరించలేదు.అందుకే తెలుగు దర్శక, నిర్మాతలు ఎక్కువగా వాటిపై ఫోకస్ పెట్టడం లేదు.

అయితే కొంత మంది మాత్రం వాటికున్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకొని సెలబ్రిటీల కథలకి దృశ్యరూపం ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నారు.

తాజాగా ఫిల్మ్ నగర్ లో ఓ ఆసక్తికర వార్త వినిపిస్తోంది.

దివంగత హీరోయిన్ ఆర్తి అగర్వాల్ జీవిత కథతో సినిమా తెరకెక్కబోతోందని తెలుస్తోంది.చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, మహేశ్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్ వంటి టాలీవుడ్ టాప్ స్టార్లందరితో ఆర్తి నటించింది.

ఒక యువ హీరోతో ప్రేమలో పడటం, ఆ తర్వాత ఆ లవ్ బ్రేకప్ కావడం జరిగింది.తరువాత ఆమె ఆత్మహత్యాయత్నం కూడా చేసుకుంది.

అయితే మరల ఆ ఆలోచన నుంచి బయటపడి శరీరం తగ్గించుకోవడానికి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండగా అదికాస్తా వికటించి చనిపోయింది.ఆమె జీవితంలో హీరోయిన్ అవ్వడం నుంచి చాలా ఘటనలు ఆసక్తికరంగా జరిగాయి.

ఈ నేపధ్యంలోనే ఆమె కథతో సినిమా తీస్తే బాగుంటుందని భావించి ఆ దిశగా ప్రముఖ దర్శకుడు ప్రయత్నం చేస్తున్నట్లు టాక్ నడుస్తుంది.

#Arthi Agarwal #Biopic Trend #Yatra #Mahanati #AarthiAgarwal

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Aarthi Agarwal Biopic Yatra Mahanati Karunam Malleswari Related Telugu News,Photos/Pics,Images..