నా మాజీ భార్యలను వారానికి ఒకసారైనా నేను కలుస్తుంటా.. అమీర్ ఖాన్!

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరచుకున్నాడు.

 Aamir Khan Reveals He Meets Ex Wives Kiran Rao Reena Dutta Least Once Week Koffee With Karan, Aamir Khan, Bollywood, Kiran Rao, Reena Dutta, Kareena Kapoor, Lal Singh Chaddha-TeluguStop.com

అయితే సినిమాల ద్వారా కంటే పెళ్లిళ్ల విషయంలోనే అమెరికన్ బాగా పాపులర్ అయ్యాడు అని చెప్పవచ్చు.అమీర్ ఖాన్ 1986 ఏప్రిల్ 18న రీనా ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

వీరిద్దరికీ ఇద్దరు పిల్లలు సంతానం.అయితే పెళ్లి అయ్యి 16 ఏళ్ళ పాటు వైవాహిక జీవితాన్ని సంతోషంగా గడిపిన వీరిద్దరూ ఆ తర్వాత 2002లో విడాకులు తీసుకుని విడిపోయారు.

 Aamir Khan Reveals He Meets Ex Wives Kiran Rao Reena Dutta Least Once Week Koffee With Karan, Aamir Khan, Bollywood, Kiran Rao, Reena Dutta, Kareena Kapoor, Lal Singh Chaddha-నా మాజీ భార్యలను వారానికి ఒకసారైనా నేను కలుస్తుంటా.. అమీర్ ఖాన్-,Top Story-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆ తర్వాత అమీర్ ఖాన్ దర్శకనిర్మాత అయినా కిరణ్ రావు ను ప్రేమించాడు.

ఆమెను 2005లో పెళ్లి చేసుకున్నాడు.

కాగా ఈ దంపతులకు ఐవీఎఫ్ పద్ధతి ద్వారా అజాద్ రావు ఖాన్ జన్మించాడు.ఆ తర్వాత 2021లో ఈ జంట విడాకులు తీసుకొని విడిపోయారు.

కాదా గత ఏడాది ఈ జంట పేర్లు సోషల్ మీడియాలో కొద్ది రోజులు మారుమోగిపోయాయి.అయితే విడాకులు తీసుకున్నప్పటికీపిల్లల విషయంలో కలిసి ఉంటామని అమీర్ ఖాన్ దంపతులు ప్రకటించిన విషయం తెలిసిందే.

ఇది ఇలా ఉంటే తాజాగా అమీర్ ఖాన్ బాలీవుడ్ ప్రముఖ పాపులర్ షో కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్నారు.అమీర్ ఖాన్ తో పాటుగా కరీనాకపూర్ కూడా హాజరైంది.

వారిద్దరికీ గ్రాండ్ గా వెల్కమ్ చెప్పినా హోస్ట్ కరణ్ షోలో భాగంగా ప్రశ్నలు వేస్తూ వారిని నవ్విస్తూనే వారి సీక్రెట్స్ ను బయటికి లాగాడు.

ఇక షోలో భాగంగా హోస్ట్ కరణ్ అడిగిన ప్రశ్నలకు అమీర్ ఖాన్ స్పందిస్తూ.తన రిలేషన్ షిప్ లో ప్రేమ, గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకోవడం ఉన్నాయి తప్ప క్రూరమైన క్షణాలు ఏమీ లేవని, తన మాజీ భార్యలు ఇద్దరి మీద తనకు ఎంతో గౌరవం ఉందని, ఇప్పటికీ వారందరూ ఒక కుటుంబంలా ఉండడమే కాకుండా ఇంత బిజీగా ఉన్నప్పటికీ వారానికి కనీసం ఒక్కసారైనా తప్పకుండా అందరూ కలుసుకుంటారట.ఇది కాకుండా వారి మధ్య కేరింగ్, ప్రేమ అభిమానాలు అలాగే ఉన్నాయి అని చెప్పుకొచ్చారు అమీర్ ఖాన్.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube