అగ్రహీరో మీద పగబట్టేసిన రాజకీయ పార్టీ

ఆమీర్ ఖాన్ – బిజెపి ప్రభుత్వం వివాదం ఇంకా సమసిపోలేదు.రోజుకో కొత్త మలుపు తీసుకుంటూనే ఉంది.

 Aamir Khan Out Of Road Safety Campaign-TeluguStop.com

బిజెపి ప్రభుత్వం రోజు దండయాత్ర చేస్తూనే ఉంది.అసహనం మీద వాఖ్యలు చేస్తే చేసాడు కాని, గత కొన్ని నెలలుగా అనడంతో ప్రధాని నరేంద్ర మోడీకి బాగా కాలినట్టుంది.

ఆమీర్ తో ఆడుకుంటున్నాడు మన ప్రధాని.రోజుకో ట్విస్ట్ ఇస్తూ ఆమీర్ కి నిద్రలేని రాత్రులు చూపిస్తోంది బిజెపి పార్టి.

మొదటిగా ఆమీర్ ఖాన్ గత పది సంవత్సరాలుగా ప్రమోట్ చేస్తున్న ఇంక్రిడబుల్ ఇండియా నుంచి ఆమీర్ నే తీసేస్తారని ఎవరు ఊహించలేదు.కాని తీసేశారు.

అంత పెద్ద హీరోకి సెక్యురిటి తగ్గించేస్తారని ఎవరు అనుకుంటారు ? కాని ఆమీర్ సెక్యురిటి తగ్గించేసారు.తాజాగా ఆమీర్ ని రోడ్ సేఫ్టి ప్రమోషన్ నుంచి కుడా తొలగించేసింది ప్రభుత్వం.

ఇది కుడా ఆమీర్ కొన్ని సంవత్సరాలుగా ప్రమోట్ చేస్తున్నాడు.కాంగ్రెస్ గవర్నమెంట్ ఏవైతే ఆమీర్ చేతిలో పెట్టిందో, అన్ని ఒక్కదాని ఒకటి లాగేసుకుంటోంది బిజెపి.

ఇదంటే గత నాలుగు రోజుల్లో జరిగింది.ఇక ముందు ఇంకేమి ప్లాన్ చేసారో ఆమీర్ కోసం.

బాక్సాఫీస్ దగ్గర రికార్డుల మీద రికార్డులు కొడుతున్నందుకు ఆనందపడాలో,పబ్లిక్ లో ఇమేజ్ డ్యామేజ్ అవడమే కాకుండా, ఇలా ప్రభుత్వం కుడా పగ పెంచుకున్నందుకు బాధపడాలో అర్థం కావట్లేదు మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ కి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube