వాలెంటైన్ డే రోజున 'లాల్ సింగ్ చద్దా'.. రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన మేకర్స్!

అక్కినేని కుటుంబం నుండి వచ్చినా తనకంటూ ప్రత్యేక మైన గుర్తింపును సంపాదించు కున్నాడు నాగ చైతన్య.విభిన్న కథలను ఎంచుకుంటూ తన విజయాలను సొంతం చేసుకుంటున్నాడు చైతూ.

 Aamir Khan Laal Singh Chaddha To Release On Valentines Day 2022 Update, Valentin-TeluguStop.com

మజిలీ సినిమా హిట్ అయిన తర్వాత నాగ చైతన్య శేఖర్ కమ్ములతో ‘లవ్ స్టోరీ‘ సినిమాలో నటించాడు.ఈ మధ్యనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ సినిమా నాగ చైతన్య కెరీర్ లోనే సూపర్ హిట్ సినిమాగా ముందు వరుసలో ఉంది.ఈ సినిమాలో చైతు నటనకు మంచి స్పందన వచ్చింది.సాయి పల్లవి తో కలిసి చైతు ఆన్ స్క్రీన్ రొమాన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.ఇక ఈ సినిమా మంచి ఫీల్ గుడ్ ఉన్న సినిమాగా ప్రేక్షకుల మదిలోకి చేరిపోయింది.

ఇక చైతన్య ఈ సినిమా తర్వాత విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ‘థాంక్యూ‘ సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమా కూడా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది.

ఈ సినిమాతో పాటు నాగ చైతన్య తన బాలీవుడ్ డెబ్యూ మూవీ ‘లాల్ సింగ్ చద్దా‘ సినిమాలో నటిస్తున్నాడు.ఈ సినిమాలో అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు.

Telugu Laalsinghchadda, Aamir Khan, Aamirkhan, Bollywood, Kareena Kapoor, Laalsi

ఈ సినిమా హాలీవుడ్ ఫారెస్ట్ గంప్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతుంది.నాగ చైతన్య కూడా ఈ సినిమాలో నటిస్తుండడంతో ఇక్కడ కూడా ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.

చైతన్య ఈ సినిమాలో నటిస్తుండడం వల్ల ఇటీవలే లవ్ స్టోరీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కూడా అమీర్ ఖాన్ హాజరయ్యారు.

Telugu Laalsinghchadda, Aamir Khan, Aamirkhan, Bollywood, Kareena Kapoor, Laalsi

లాల్ సింగ్ చద్దా సినిమాను డిసెంబర్ లో రిలీజ్ చెయ్యాలని భావించిన బాలీవుడ్ లో కరోనా కారణంగా ఇంకా థియేటర్స్ ఓపెన్ అవ్వకపోవడంతో ఈ సినిమాను పోస్ట్ పోన్ చేస్తున్నట్టు మేకర్స్ తెలిపారు.

అంతేకాదు కొత్త రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు.ఈ సినిమాను వాలెంటైన్ డే సందర్భంగా రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు.

ఇక ఈ సినిమాలో కరీనా కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు.వయాకామ్ సంస్థతో కలిసి అమీర్ ఖాన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube