తారక్ కు విలన్ గా బాలీవుడ్ స్టార్ హీరో.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ రేంజ్ ఇదే?

టాలీవుడ్ హీరో పాన్ ఇండియా స్టార్ జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఎన్టీఆర్ ఇటీవల విడుదల అయిన ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.

 Aamir Khan Jr Ntr Film Kgf Director Prashanth Neel Next Film , Aamir Khan, Jr Nt-TeluguStop.com

ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారాడు.ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ తదుపరి సినిమాల విషయంలో ఇప్పటికీ అభిమానులకు కన్ఫ్యూషన్ గానే ఉంది అని చెప్పవచ్చు.

ఇకపోతే ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంతి నీల్ కాంబినేషన్లో ఒక సినిమా రాబోతుంది అన్న సంగతి మనందరికీ తెలిసిందే.ఇప్పటికే ఇందుకు సంబంధించి ఎన్నో రకాల వార్తలు వినిపించాయి.

ఈ సినిమాకు టైటిల్ ఇంకా కన్ఫామ్ చేయలేదు కానీ ఎన్టీఆర్ 31 అని పేరు పెట్టారు.వీరి కాంబినేషన్లో రాబోతున్న సినిమాకు సంబంధించి తాజాగా మరొక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఎన్టీఆర్, ప్రశాంతి నీల్ కాంబినేషన్లో తెరకెక్కబోతున్న సినిమాలో బాలీవుడ్ నటుడు స్టార్ హీరో అయిన అమీర్ ఖాన్ కూడా నటించబోతున్నట్టు తెలుస్తోంది.ఈ ప్రాజెక్టుకి సంబంధించిన షూటింగ్ను ఏడాదిలోనే మొదలుపెట్టే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.

ఈ విషయంపై ఇంకా అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.అయితే ఈ మధ్యకాలంలో పాన్ ఇండియా సినిమాలలో టాలీవుడ్ స్టార్ తో పాటు బాలీవుడ్ స్టార్స్ ని కూడా ఎంట్రీ ఇప్పిస్తున్నారు.

Telugu Aamir Khan, Koratala Siva, Jr Ntr, Chiranjeevi, Prashanth Neel-Movie

ఇటీవల మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమాలో సల్మాన్ ఖాన్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.ఇప్పుడు ఎన్టీఆర్ నటించబోతున్న సినిమాతో అమీర్ ఖాన్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.ఇక ఎన్టీఆర్ 30వ సినిమా దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో రానున్న విషయం తెలిసిందే.ఇప్పటికే ఆ ప్రాజెక్టుకు సంబంధించిన ఎన్నో రకాల ఊహాగానాలు వినిపించాయి.ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్ జనవరిలో మొదలుకానుంది.అయితే ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత నటిస్తున్న సినిమా ఇదే.ఇప్పటికే ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కబోతున్న సినిమాకు సంబంధించిన పోస్టర్ నీ కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే.కాగా ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సలార్ సినిమాతో బిజీబిజీగా ఉన్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube