అటు బీజేపి లీడర్లు , ఇటు గవర్నమెంటు, మధ్యలో అగ్రహీరో

ఈరోజు మధ్యాహ్నం నుంచి కొంతమంది బిజేపి లీడర్లు ఇంక్రిడబుల్ ఇండియా నుంచి ఆమీర్ ఖాన్ తొలగించినట్లు ప్రకటించారు.ఆమీర్ డబ్బులేమి తీసుకోకుండా భారత టూరిజంని ఇంక్రిడబుల్ ఇండియా పేరుతో ప్రమోట్ చేస్తాడనే విషయం తెలిసిందే.

 Aamir Is Brand Ambassador Of Incredible India – Indian Government-TeluguStop.com

ఇటివలే ఆమీర్ అసహనం మీద చేసిన వాఖ్యలు వివాదస్పదం అవడంతో కొన్ని మతవర్గాల పెద్దలు ఆమీర్ ని ఇంక్రిడబుల్ ఇండియా నుంచి తొలగించాల్సిందే అని డిమాండ్ చేసారు.

ఈరోజు ఏకంగా అమిత్ మాల్వియా అనే బిజేపి లీడర్ ఆమీర్ ఇకనుంచి ఇంక్రిడబుల్ ఇండియాకు సేవలు అందించడు అని ప్రకటించడంతో దేశవ్యాప్తంగా ప్రముఖ వార్త ఛానెల్లు, వెబ్ సైట్లు, ఆమీర్ ను ఇంక్రిడబుల్ ఇండియాను తొలగించారనే వార్తలను ప్రసారం చేసాయి.

కొంతమంది ఆమీర్ చేసిన వాఖ్యలకు సరైన శాస్తి జరిగిందని వాఖ్యానిస్తే, మరి కొంతమంది ఆమీర్ దేశానికి చేసిన సేవలు ఈ గవర్నమెంటు మరిచిందని నిరసనలు తెలిపారు.ఈ మిశ్రమ స్పందలను ఆపివేసేందుకు గవర్నమెంటు స్వయంగా ఒక ప్రకటన విడుదల చేసింది.

ఆమీర్ ఖాన్ ఇకపై కూడా ఇంక్రిడబుల్ ఇండియా ప్రచారకర్తగా వ్యవహరిస్తారని, వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదని ప్రకటించింది భారత టూరిజం మినిస్ట్రీ.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube