అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు ఆస్తుల విలువెంతో తెలుసా..?

బాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన అమీర్ ఖాన్ తన భార్య కిరణ్ రావుతో 16 సంవత్సరాల వైవాహిక బంధానికి స్వస్తి చెప్పిన సంగతి తెలిసిందే.శనివారం అమీర్ ఖాన్, కిరణ్ రావు తాము కొత్త లైఫ్ ను మొదలుపెట్టాలని అనుకుంటున్నామని కీలక ప్రకటన చేశారు.

 Aamir Khan Ex Wife Kiran Rao Net Worth Income Salary And Luxury Cars, Aamir Khan-TeluguStop.com

అమీర్ ఖాన్ భార్య అయినప్పటికీ కిరణ్ రావుకు సినిమా ఇండస్ట్రీలో ప్రత్యేకమైన పేరు ఉంది.డైరెక్టర్ గా, ప్రొడ్యూసర్ గా, స్క్రీన్ రైటర్ గా కిరణ్ రావు పేరును సంపాదించుకున్నారు.

తన ప్రతిభ, కష్టంతో కిరణ్ రావు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు.తన సంపాదనలో కిరణ్ రావు కొంత మొత్తాన్ని ఎన్జీవో సంస్థలకు కూడా సహాయం చేస్తుండటం గమనార్హం.

తాజాగా అమీర్ ఖాన్, కిరణ్ రావు విడిపోవడంతో నెటిజన్లలో చాలామంది కిరణ్ రావు గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.మహిళా డైరెక్టర్ అయిన కిరణ్ రావు ఆస్తుల విలువ 20 మిలియన్ డాలర్లు అని సమాచారం.

2005 సంవత్సరం డిసెంబర్ నెల 28వ తేదీన అమీర్ ఖాన్, కిరణ్ రావు వివాహం చేసుకున్నారు.కిరణ్ రావుకు సొంతంగా సకల సౌకర్యాలతో కూడిన ఇల్లు ఉండటంతో పాటు ఖరీదైన వాహనాలు కూడా ఉండటం గమనార్హం.2020లో వేసిన అంచనాల ప్రకారం ఆమె ఆస్తి 146 కోట్ల రూపాయలు అని తెలుస్తోంది.2011 సంవత్సరంలో అమీర్ ఖాన్, కిరణ్ రావు దంపతులకు అద్దె గర్భం ద్వారా ఆజాద్ అనే బాబు జన్మించాడు.

Telugu Aamir Khan, Kiran Rao, Luxury Cars-Movie

కిరణ్ రావు నిర్మాతగా మారి నిర్మించిన సినిమాలు సైతం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి.ధోభీఘాట్ అనే సినిమాకు కిరణ్ రావు నిర్మాతగా, దర్శకురాలిగా వ్యవహరించారు.అమీర్ ఖాన్, కిరణ్ రావు విడిపోవడానికి అసలు కారణం తెలియాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube