కొడుకు కోసం కలిసిన అమీర్ ఖాన్ -కిరణ్ రావ్ దంపతులు!

Aamir Khan And Kiran Rao Couple Meet For His Son

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ ఇప్పటికే రెండు వివాహాలు చేసుకొని ఇద్దరు భార్యలకు విడాకులు ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే తన రెండవ భార్య కిరణ్ రావ్ కు విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.

 Aamir Khan And Kiran Rao Couple Meet For His Son-TeluguStop.com

ఈ క్రమంలోనే విడాకుల తర్వాత వారి బంధం స్నేహితులుగా కొనసాగుతుందని ప్రకటించారు.ఇలా అమీర్ ఖాన్ వెల్లడించిన తర్వాత వీరిద్దరు పలు సందర్భాలలో       పాల్గోనడం జరిగింది.

అదేవిధంగా అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చద్దా సినిమా కోసం కిరణ్ రావ్ పని చేశారు.ఇలా విడాకులతో విడిపోయిన ఈ జంట తన కొడుకు కోసం కలిశారు.

 Aamir Khan And Kiran Rao Couple Meet For His Son-కొడుకు కోసం కలిసిన అమీర్ ఖాన్ -కిరణ్ రావ్ దంపతులు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ క్రమంలోనే వీరి కొడుకు పుట్టినరోజు కావడంతో అమీర్ ఖాన్ కిరణ్ రావ్ దగ్గరుండి తన కొడుకు చేత కేక్ కట్ చేయించి పుట్టినరోజు వేడుకలు జరిపారు.ఈ పుట్టినరోజు వేడుకలలో అమీర్ ఖాన్ మొదటి భార్య రీనా దత్త కూడా పాల్గొన్నారు.

Telugu Aamir Khan, Kiran Rao, Meet, Tollywood-Movie

ఈ క్రమంలోనే ఈ సెలబ్రేషన్స్‌కి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇవి కాస్త వైరల్ గా మారాయి.ఇకపోతే అమీర్ ఖాన్ తన తదుపరి చిత్రాలకి కూడా కిరణ్ రావ్ పని చేస్తున్నట్లు తెలుస్తోంది.ఇక అమీర్ నటించిన లాల్ సింగ్ చద్దా ఈ నెల విడుదల కావాల్సి ఉండగా పలు కారణాల వల్ల వాయిదా పడింది.ఇందులో టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య కూడా నటించారు.

#Aamir Khan #Kiran Rao

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube